తెలుగు సినీ పరిశ్రమలో నటిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటి మనులలో అతిథి రావు హైదరి ఒకరు. ఈ ముద్దుగుమ్మ సమ్మోహనం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ తో ఈ నటికి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత ఈ బ్యూటీ వి ... మహా సముద్రం సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఇందులో వి సినిమా ధియేటర్ లలో కాకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల కాగా మహా సముద్రం సినిమా ధియేటర్ లలో విడుదల అయినప్పటికీ ఈ మూవీ ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది.
దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే ఇప్పటి వరకు ఈ బ్యూటీ నటించింది తక్కువ సినిమాలే అయినప్పటికీ అందులోనే తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే సినిమాల్లో ఈ బ్యూటీ ఏ స్థాయిలో అయితే అందాలను ఆరబోస్తూ ఉంటుందో అంతకు మించిన స్థాయిలోనే అదితి సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ నటి తనకు సంబంధించిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అందులో చాలా వరకు వైరల్ కూడా అయ్యాయి.
ఇది ఇలా ఉంటే అప్పుడప్పుడు ఈ నటి తనకు సంబంధించిన క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఎరుపు రంగులో ఉన్న శారీని కట్టుకొని అందుకు తగిన ఎరుపు రంగులో ఉన్న బ్లౌజ్ ను ధరించి చాలా క్లాస్ అండ్ ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లి పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.