పెళ్లి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మృణాల్....!!

murali krishna
'హాయ్‌ నాన్న'తో యష్నగా ప్రేక్షకులను అలరిస్తున్నారు నటి మృణాల్‌ ఠాకూర్‌ . నాని హీరో గా నటించిన ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.తండ్రీ కుమార్తె ల కథ తో తెరకెక్కిన ఈ సినిమా లో మృణాల్‌ నటన తమ కెంతో నచ్చిందంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. యష్న పాత్ర తమ మనసుకు చేరువైందంటున్నారు.ఇదిలా ఉండగా.. తన తదుపరి సినిమా 'ఫ్యామిలీ స్టార్‌' షూట్‌ లో భాగం గా మృణాల్‌ ప్రస్తుతం న్యూజెర్సీ లో ఉన్నారు. 'హాయ్‌ నాన్న'కు వస్తోన్న ఆదరణను దృష్టి లో ఉంచుకుని ప్రేక్షకుల తో కాసేపు మాట్లాడేందుకు అక్కడి థియేట ర్‌కు వెళ్లారు. ''హాయ్‌ నాన్న' నాకెంతో ప్రత్యేకమైన చిత్రం. నాని ప్రస్తుతం ఇండియా లో ఉన్నారు. రేపు ఆయన ఇక్కడికి రావొచ్చు. 'ఫ్యామిలీ స్టార్‌' షూట్‌ లో భాగంగా నేను ఇక్కడికి వచ్చాను. నాని వచ్చిన తర్వాత మరోసారి (న్యూజెర్సీ సినీ లవర్స్‌ను ఉద్దేశించి) మీ అందరినీ కలిసేందుకు వస్తా. 'సమయమా'.. 'అమ్మాడీ' నాకెంతో ఇష్టమైన పాటలు. 'సీతారామం' నుంచి న్యూజెర్సీ నాపై ఎంతో ప్రేమను కురిపిస్తోంది. 'సీతారామం' సమయం లోనూ నేను ఇక్కడికి వచ్చా. 'హాయ్‌ నాన్న'తో ఇక్కడి ప్రేక్షకులను కలవడం అదృష్టంగా భావిస్తున్నా'' అని ఆమె అన్నారు. ఇంత లో అక్కడే ఉన్న ఓ పిల్లాడు.. ''మీకు పెళ్లైందా?'' అని ప్రశ్నించాడు. ఆ మాటల కు నవ్వులు పూయించిన ఆమె ''త్వరలోనే.. త్వరలోనే.. పెళ్లి చేసుకుంటా'' అని బదులిచ్చారు.ఈ సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ గురువారం సాయంత్రం హైదరాబాద్‌ లో వేడుకగా జరిగాయి. నాని, బేబీ కియారా, ఇతర చిత్ర బృందం పాల్గొని బెలూన్స్‌ ఎగురవేసి తమ ఆనందాన్ని తెలియజేశారు. దీనికి సంబంధించిన ఫొటోని షేర్‌ చేసిన నాని.. ''సినిమా.. మీ ప్రేమను సెలబ్రేట్‌ చేసుకుంటున్నాం'' అని పోస్ట్ పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: