డిసెంబర్ 29నే కళ్యాణ్ రామ్ డెవిల్..!!
అయితే ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కొన్ని కారణాల చేత విడుదల ఆలస్యం అవుతూ ఉన్నది.. అయితే సడన్గా డిసెంబర్ 29వ తేదీన డెవిల్ సినిమాని విడుదల చేయబోతున్నట్లు గత రెండు రోజుల క్రితం నుంచి విషయం వైరల్ గా మారుతోంది.ఫైనల్ గా ఈ డేట్ ని చిత్ర బృందం ఫిక్స్ చేసినట్లుగా కూడా ఒక పోస్టర్ ద్వారా తెలియజేశారు. డిసెంబర్ 29నే కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా రాబోతోంది అంటూ తెలియజేశారు. కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందించిన సినిమా అని తెలియజేస్తూ ఉన్నారు అభిమానులు.
ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పైన నిర్మించడం జరుగుతోంది.ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషలలో విడుదల చేయడానికి సిద్ధంగానే ఉన్నారు. కీలకమైన పాత్రలో హీరోయిన్ మాళవిక నాయర్ కూడా నటించబోతోంది. ఇప్పటివరకు డెవిల్ సినిమాకి సంబంధించి ఎలాంటి ప్రమోషన్స్ కూడా చేయలేదు.. మరి ట్రైలర్తో నైనా ఈ సినిమా పైన భారీగా అంచనాలు పెరిగిపోయేలా కనిపిస్తున్నాయి. కళ్యాణ్ రామ్ సినిమా కి సంబంధించి ఈ కంటెంట్ క్లిక్ అయితే ఈ ఏడాది ఫినిషింగ్ టచ్ ఇచ్చే సినిమా ఇదే అని కూడా అభిమానుల సైతం తెలియజేస్తూ ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి.