రష్మిక మందన్న వార్షిక సంపాదన ఎంతో తెలుసా....??

murali krishna
1996లో జన్మించింది రష్మిక. 'కిరిక్ పార్టీ' అంటూ తొలి తోనే కుర్రాళ్ల హృదయాల ను దోచేసింది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది.ఛలో తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి గీతా గోవిందం మూవీతో స్టార్ డమ్ అందుకుంది. దీంతో బ్యాక్ టూ బ్యాక్ లతో టాప్ హీరోయిన్‍ గా నిలిచింది. ఇక అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబో లో వచ్చిన పుష్ప మూవీ ఈ ముద్దు గుమ్మ క్రేజ్ ఒక్కసారి గా మార్చేసింది. ఈ పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ బ్రేక్ చేసింది. దీంతో హిందీ లోనూ ఈ అమ్మడికి మంచి ఆఫర్స్ వచ్చాయి. ఇటీవల రణబీర్ కపూర్ జోడిగా నటించిన యానిమల్ సైతం భారీ విజయాన్ని అందించింది. ప్రస్తుతం అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల లో ఒకరి గా నిలిచింది రష్మిక. ఇప్పటివరకు రష్మిక సంపాదించిన ఆస్తులు, ఖరీదైన కార్స్ కలెక్షన్ గురించి తెలుసుకుందామా.
నివేదికల ప్రకారం ఇప్పటివరకు రష్మిక దాదాపు రూ.45 కోట్లు ఆస్తి సంపాదించినట్లు సమాచారం. ఆమె నెలవారీ ఆదాయం రూ.60 లక్షలకు పైగా ఉంటుందని, ఆమె వార్షిక ఆదాయం రూ.8 కోట్లు అని సమాచారం. దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమ లో అత్యధిక పారితోషికం తీసుకునే టాప్ 10 నటీమణుల లో రష్మిక ఒకరు. ఒక్కో కు దాదాపు రూ.4 నుంచి 5 కోట్లు తీసుకుంటుంది. యానిమల్ అద్భుతమైన విజయం తర్వాత ఆమె తన ఫీజు ను పెంచే అవకాశం ఉంది. రష్మిక మందన్న దేశవ్యాప్తం గా వివిధ నగరాల్లో పలు ఆస్తులను కొనుగోలు చేసింది. ఆమెకు ముంబైలో విలాసవంతమైన అపార్ట్‌మెంట్, రూ. 8 కోట్ల విలువైన బంగ్లా , గోవా, కూర్గ్, హైదరాబాద్‌ లలో ఇతర అద్భుతమైన ఆస్తులు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: