రజనీకాంత్ 170 సినిమాలో హీరోయిన్ కి గాయాలు..!!

Divya
హీరోయిన్ రితికా సింగ్ వెంకటేష్ నటించిన గురు సినిమాలో పాటు నీవెవరో వంటి సినిమాలలో నటించడం జరిగింది. ఈ సినిమా తర్వాత పలు చిత్రాలలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. తన నటనతో గ్లామర్ తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఏకంగా రజనీకాంత్ నటిస్తున్న 170 సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్లో భాగంగా ఈమెకు గాయాలైనట్లుగా ఇటీవల కొన్ని సోషల్ మీడియాలో ఫోటోలు సైతం వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా తన చేతిలో ఉన్న అద్దం పగుళ్లను చూపిస్తూ గాజు పెంకులు దిగినట్లుగా తెలియజేసింది.


ఈ విషయాన్ని రితిక సింగ్ స్వయంగా ఇంస్టాగ్రామ్ లో తెలియజేయడం జరిగింది. గాజు అద్దం ఉంది జాగ్రత్త ఉండమని సెట్లో చాలామంది చెప్పారని కానీ ఆ సమయంలో అదుపుతప్పి దాన్ని సరిగా పట్టుకోలేకపోయానని తెలియజేసింది. ప్రస్తుతానికి అయితే నొప్పి లేదు కానీ కొన్ని గాజు ముక్కలు చాలా లోతుగా దిగాయని తెలిపింది. అందుకే ఆస్పత్రికి వెళ్లి పూర్తిగా తగ్గిన తర్వాతే తిరిగి షూటింగ్లో పాల్గొనబోతున్నట్లుగా తెలియజేసింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ జ్ఞానబెల్ తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోని రితికా సింగ్ కొన్నాళ్లపాటు షూటింగ్ కి హాజరయ్యే ఛాన్స్ లేదని చెప్పవచ్చు.


కింగ్ ఆఫ్ కొత్త అనే సినిమాలో ఇటీవల నటించి మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం రజనీకాంత్ 170 సినిమాలో మినహా మరో కొత్త సినిమాలో నటించలేదు..తెలుగులో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ పెద్దగా రావడం లేదని తెలుస్తోంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాలుగా ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లోనే ఉంటుంది. యువతకి మహిళలకి సైతం సెల్ఫ్ డిఫెన్స్ కోసం మార్షల్ ఆర్ట్స్ లో పలు రకాలు టిప్స్ ని కూడా తెలియజేస్తూ ఉంటుంది రితికా సింగ్. చిన్న వయసు నుంచి మహిళలు వీటిపట్ల ఆసక్తి చూపించాలని కూడా అప్పుడప్పుడు తెలియజేస్తూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: