ప్రస్తుతం సౌత్ ఇండియాలో ఊహించని స్థాయిలో రెమ్యునరేషన్ ను అందుకుంటున్న హీరోయిన్లలో
నయనతార ఒకరు కాగా నయన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.నయనతార పారితోషికం 10 నుంచి 12 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. ఇతర హీరోయిన్లతో పోల్చి చూస్తే నయన్
సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా ఉందనే సంగతి తెలిసిందే. అయితే
నయనతార యంగ్ హీరోకు అక్క పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది.కోలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్న
ప్రదీప్ రంగనాథన్
లవ్ టుడే సినిమాతో ప్రశంసలతో పాటు విజయాన్ని సైతం అందుకున్నారు. ఈ నటుడికి సోషల్ మీడియాలో సైతం క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. వరుసగా క్రేజీ ఆఫర్లతో
ప్రదీప్ రంగనాథన్ బిజీగా ఉండగా ఇతని పారితోషికం 20 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో లియో నిర్మాతల నిర్మాణంలో
ప్రదీప్ రంగనాథన్ హీరోగా ఒక
సినిమా ఫిక్స్ అయిందని తెలుస్తోంది. ఈ సినిమాలో
హీరో అక్క పాత్రలో నయన్ కనిపించనున్నారని భోగట్టా. అతి త్వరలో ఈ
సినిమా షూటింగ్ మొదలుకానుందని తెలుస్తోంది. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. పాన్
ఇండియా మూవీగా ఈ
సినిమా విడుదల కానుందని తెలుస్తోంది.
అజిత్ విఘ్నేష్ శివన్ కాంబినేషన్ లో ఒక
సినిమా తెరకెక్కాల్సి ఉండగా వేర్వేరు కారణాల వల్ల ఆ
సినిమా ఆగిపోయింది.విఘ్నేష్ శివన్ ఈ సినిమాతో కచ్చితంగా
సక్సెస్ సాధించాల్సి ఉంది.
విఘ్నేష్ శివన్ తర్వాత ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తారో చూడాల్సి ఉంది. నయన్ భర్తకు కెరీర్ పరంగా ఈ
సినిమా సక్సెస్ సాధించడం కీలకమని చెప్పవచ్చు. నయన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. నయన్ (Nayanthara) అక్క పాత్రల్లో నటించడం తమకు ఇష్టం లేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.