
నాగచైతన్య కు సమస్యగా మారిన దూత !
అక్కినేని ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ ఇప్పటికీ చైతన్య తన కెరియర్ విషయంలో ఎత్తు పల్లాలను ఎదుర్కుంటూనే ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో చైతూ నటించిన ‘దూత’ వెబ్ సిరీస్ కు విపరీతమైన స్పందన రావడంతో అక్కినేని అభిమానులు ఆనందపడుతున్నారు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ తో తిరిగి ట్రాక్ లోకి చైతన్య వచ్చాడు అని అనిపిస్తోంది.
ఈ వెబ్ సిరీస్ లో చైతన్య లుక్ అదేవిధంగా అతడి బాడీ లాంగ్వేజ్ ఆపై నటన అన్నీ బాగ్ కుదరడంతో ఈ వెబ్ సిరీస్ చూసిన వారు చైతూ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఇక్కడే చైతును టార్గెట్ చేస్తూ కొందరు కామెంట్స్ పెడుతున్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ లాంటి చెత్త సినిమాలో నటించి పేరు పోగొట్టుకునే బదులు ఇలాంటి మంచి కథలను ఎంచుకుని సినిమాలు చేయవచ్చు కదా అంటూ కొందరు సోషల్ మీడియా ద్వరా చైతన్యకు ఉచిత సలహాలు ఇస్తున్నారు.
‘మనం’ మూవీతో అక్కినేని హీరోలకు బాగా దగ్గర అయిన విక్రమ్ కుమార్ ఆతరువాత అఖిల్ నాగచైతన్యల తో ‘హలో’ థాంక్యూ’ సినిమాలు తీసినప్పటికీ ఆసినిమాలు అంచనాలను అందుకోలేక పోవడంతో ఆసినిమాలు ఫెయిల్ అయ్యాయి. దీనితో ‘దూత’ వెబ్ సిరీస్ కు కూడ అదే పరిస్థితి పడుతుందని చాలమంది భావించారు. అయితే ఆ అంచనాలను తలక్రిందులు చేస్తూ ఇప్పుడు ‘దూత’ హిట్ అయినప్పటికీ ఆ హిట్ ఎంతవరకు హీరోగా నాగచైతన్య కెరియర్ కు ఉపయోగ పడుతుంది అన్న విషయం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..