టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'గుంటూరు కారం' సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ 'ధమ్ మసాలా'కి ఫ్యాన్స్ నుంచి సూపర్ సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చింది.దీంతో ఇప్పుడు సెకండ్ సింగిల్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటీవల నిర్మాత నాగవంశీ త్వరలో సెకండ్ సింగిల్ వస్తుందని కూడా ప్రకటించాడు.. కానీ ఆ తర్వాత అసలు ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో రెండో పాట ఎప్పుడంటూ మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆయన్ని గట్టిగా అడుగుతున్నారు.తాజాగా వారికి హీరో నితిన్ కూడా తోడు కావడంతో నిర్మాత తప్పక తాజా అప్డేట్ ని ఇచ్చాడు. దీంతో సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. 'మ్యాడ్' మూవీ విడుదల సమయంలో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ, "మా సినిమా చూసి మీకు నవ్వు రాకపోతే మీ డబ్బులు వెనక్కిస్తాం" అని అన్నాడు.
ఇక ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ తన కొత్త సినిమా 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్' ప్రమోషన్స్ లో నితిన్ మాట్లాడుతూ "మా సినిమా చూసి మీరందరూ కడుపుబ్బా నవ్వకపోతే..మీ డబ్బులు వంశీ గారు వెనక్కిస్తారు" అని సరదాగా ఆయన అన్నాడు. నితిన్ వ్యాఖ్యలపై X వేదికగా స్పందించిన నాగవంశీ "ఆ రోజు మ్యాడ్ వైబ్ లో అలా అనేసాం.. మీరు ఇలా లాక్ చేస్తే ఎలా" అని రిప్లై ఇచ్చాడు. దానికి బదులిచ్చిన హీరో నితిన్ "ఏదో ఎక్స్ ట్రా ఆర్డినరీ వైబ్ లో నేనూ అనేసా.అది ఓకే కానీ, గుంటూరు కారం నుంచి సెకండ్ సింగిల్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాం. "అప్డేట్ ఎప్పుడు ఇంతకీ" అంటూ వంశీని ఇరికించేశాడు. దీంతో ఇక తప్పక వంశీ గుంటూరు కారం అప్డేట్ ని ఇచ్చేశాడు.అందుకు సంబంధించి పనులు జరుగుతున్నాయి. ఇంకోక రెండ్రోజుల్లో సూపర్ అనౌన్స్‌మెంట్ ఇస్తాం" అని తెలిపాడు. దీంతో సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఈ సాంగ్ మొదటి పాట కంటే సూపర్ గా ఉంటుందని సమాచారం తెలుస్తుంది.