టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం "నా సామి రంగా" అనే విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ప్రముఖ కొరియో గ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన అమిగొస్ మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఆ రంగనాథ్ ఈ మూవీ లో నాగార్జున కు జోడిగా నటిస్తోంది. ఇకపోతే ఈ మూవీ లో అల్లరి నరేష్ , రాజ్ తరుణ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.
ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయాలి అనే ఉద్దేశంతో ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను కూడా ఫుల్ స్పీడ్ గా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ఆశిక కి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ వీడియోను నిన్న రాత్రి బిగ్ బాస్ వేదికగా విడుదల చేసింది.
ఇకపోతే ఈ మూవీ లో ఆశిక ... వరలక్ష్మీ పాత్రలో కనిపించబోతున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ గ్లిమ్స్ వీడియోలో పల్లెటూరి గెటప్ లో ఆశిక ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఇందులో నాగార్జునను కూడా చూపించగా ఆయన కూడా తన అద్భుతమైన లుక్ లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇకపోతే ఓవరాల్ గా ఈ వీడియోకు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. దానితో ఈ మూవీ ఆల్బమ్ పై కూడా ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.