గుర్తుపట్టలేనంతగా మారిపోయిన.. బాలయ్య 'ఆదిత్య 369' హీరోయిన్?

praveen
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లు ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా హవా నడిపిస్తూ ఉంటారు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం  కేవలం ఒకే ఒక సినిమాతో పాపులారిటీ సంపాదించినా.. ఆ తర్వాత కొన్ని సినిమాలకు మాత్రమే పరిమితం అవుతూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇలా సినిమాల్లో కనుమరుకైన వారు చాలా ఏళ్లకి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సీరియల్స్ లో నటించడం లేదా సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించడం చేస్తూ ఉంటారు. మరి కొంతమంది  సినిమాలకు దూరంగానే ఉంటారు.

 అయితే ఇలా సినిమాలకు దూరంగా ఉన్న హీరోయిన్ కు సంబంధించిన ఫోటోలు చాలా ఏళ్ల తర్వాత సోషల్ మీడియాలో కనిపించాయి అంటే చాలు అవి తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు బాలకృష్ణ హీరోయిన్ కు సంబంధించిన ఫోటోలు ఇలాగే వైరల్ గా మారిపోతున్నాయి. బాలకృష్ణ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన ఆదిత్య 369 సినిమా గురించి ఇప్పటి ప్రేక్షకులకు కూడా తెలుసు. ఇందులో ద్విపాత్రాభినయం చేసాడు బాలకృష్ణ. అయితే ఇందులో ఒక పాత్రకు మోహిని అని హీరోయిన్ జోడిగా నటించింది. తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన ఈమెకు సంబంధించిన  ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

 మోహిని అసలు పేరు మహాలక్ష్మి. తమిళనాడులోని తంజావూరులో పుట్టింది. అక్కడే చదువును కూడా పూర్తి చేసింది  అయితే 1987లో రిలీజ్ అయిన కుట్టు పుజుకల్ అనే సినిమాలో బాలనటిగా నటించింది. ఆ తర్వాత కోలీవుడ్ లోనే పలు సినిమాల్లో నటించింది. ఇక తెలుగు నుంచి కూడా మంచి అవకాశాలు దక్కించుకుంది. బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 మూవీలోని కనిపించింది. ఇక తర్వాత మోహన్ బాబు సరసన డిటెక్టివ్ నారద.. చిరంజీవి హిట్లర్ మూవీ లో చిరు చెల్లెలి పాత్రలో కూడా నటించింది. అయితే ఇటీవలే మోహిని ఏకంగా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇక ఈ హీరోయిన్ ఫోటోలను చూసి ఫ్యాన్స్ అందరూ కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: