గుంటూరు కారం నుంచి అదిరిపోయే అప్డేట్..!!

Divya
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైడెడ్ చిత్రం గుంటూరు కారం.. ఈ సినిమా వచ్చేయేడాది సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి సంబంధించి తాజా అప్డేట్ ఒకటి బయటికి రావడం జరిగింది.. అదేమిటంటే ANR వర్చువల్ స్టూడియోలో ఈ చిత్రానికి సంబంధించి సినిమా షూటింగ్ జరుగుతున్నట్లుగా మేకర్స్ ఒక విషయాన్ని తెలియజేశారు.. సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రం నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందా అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తూనే ఉన్నారు.

ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ సాంగ్ సింగిల్ ని దమ్ మసాల రిలీజ్ చేయడం జరిగింది. ఈ పాటకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు తాజాగా మరొక అప్డేట్ ను తీసుకువచ్చింది. ప్రస్తుతం గుంటూరు కారం చిత్ర బృందం మొత్తం అన్నపూర్ణ స్టూడియోలో చాలా బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ కూడా చాలా వేగంగా జరుగుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మేకర్ కన్ఫామ్ చేస్తూ ఈ వర్చువల్  వారి స్టూడియో ప్రత్యేకత ఏమిటి అంటూ తెలియజేశారు.
అయితే ఈ సినిమా షూటింగ్ కోసం లొకేషన్లు చుట్టూ తిరగకుండా బ్యాగ్రౌండ్ లో అనుకున్న లొకేషన్ కలిగి ఉండే అనుభూతిని సైతం కలిగిస్తారు. కావలసిన విధంగా మార్పులు చేసి ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసే పనిలో పడ్డట్లు తెలుస్తోంది చిత్ర బృందం. వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ఫిక్స్ చేశారు .ఈ సినిమా పైన భారీ అంచనాలు సైతం పెరిగిపోతున్నాయి. మహేష్ కు జోడిగా శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు హారిక అండ్ హాసిని క్రియేషన్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండడం జరుగుతోంది .ఈ సినిమాకి సంగీతాన్ని థమన్ అందిస్తూ ఉన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: