తెలంగాణ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ హవా చూపించేనా..?

Divya
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎన్నికలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇటీవలే తెలంగాణ ఎన్నికల బరిలో కూడా మొదటిసారి దిగడం జరిగింది. ఆయన పార్టీ పెట్టాక పోటీ చేసేందుకు దాదాపుగా కొన్ని సంవత్సరాలు పట్టింది. 2014 మార్చి 14న తన పార్టీని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికలలో ఎక్కడ పోటీ చేయలేదు.. 2018 లో కూడా ఆయన పోటీ చేయలేదు. అయితే 2023 నాటికి మాత్రం పలువురు నాయకులు తెలంగాణలో పోటీ చేయాలని ఒత్తిడి చేయడంతో తానే సొంతంగా 32 సీట్లలో పోటీ చేయిస్తానని ప్రకటించడం జరిగింది.

కానీ అనుకోకుండా అనూహ్యంగా బిజెపితో ఆయన పొత్తు పెట్టుకుని కేవలం 8 సీట్లలోనే పోటీకి దిగడం జరిగింది. ఇందులో జనసేనకు గెలుపు అవకాశాలు ఉన్న సీట్లు ఎన్ని అనే విషయంపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. అయితే తెలంగాణలో ఎన్నికల హవ చాలా హోరాహోరీగా సాగుతున్నది.అయితే BRS , కాంగ్రెస్ అన్నట్లుగానే పొలిటికల్ వార్ జరుగుతున్నట్లు కనిపిస్తున్నది. బిజెపి అధికారం కోసమే టార్గెట్ చేస్తే చివరికి ఆ పార్టీకి మూడు నుంచి నాలుగు సీట్లు వస్తాయని రకాల సర్వేలు కూడా తెలియజేస్తున్నాయి.

మరి ఇదంతా ఇలా ఉంటే తెలంగాణలో జనసేన పార్టీ ఏమాత్రం నిలదొక్కుకోలేక పోయిందని చెప్పవచ్చు. సడన్గా బరిలోకి దిగగానే జనసేనకి ఎలాంటి అవకాశాలు ఎన్నికలలో ఉంటాయని విషయంపై చర్చ జరుగుతుంది పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్ ఆయన వెనుక ఉన్న బలమైన సామాజిక అండగా ఉన్నదని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇవి ఏ మేరకు ఆయనకు వర్కౌట్ అవుతాయి ఆ ఎనిమిది సీట్ల విషయంలో ఏంటనే విషయం మరో కొద్ది రోజులలో తేలనుంది. మరి ఈ భవిష్యత్తు మొత్తం ఏపీ జనసేన పార్టీ పైన కూడా చూపే అవకాశం ఎక్కువగా ఉంటుందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఏపీలో అయితే టీడీపీకి సపోర్ట్ చేస్తున్న జనసేన.. టిడిపి మాత్రం తెలంగాణలో కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: