దానికోసం కష్టపడుతున్న సమంత....!!

frame దానికోసం కష్టపడుతున్న సమంత....!!

murali krishna
సమంతపై మాయో సైటిస్ ప్రభావం ఇంకా కొనసాగుతోంది. ఆ వ్యాధి నుంచి సామ్ కోలుకున్నప్పటికీ మునుపటి ఫిట్ నెస్ సాధించేందుకు సామ్ అనేక ప్రయత్నాలు చేస్తోంది.స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం పూర్తిగా తన ఆరోగ్యం పైనే ఫోకస్ పెడుతోంది. సామ్ చివరగా ఖుషి చిత్రంలో విజయ్ దేవరకొండకి జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సమంత ఏ చిత్రానికి సైన్ చేయలేదు. తన ఆరోగ్యం కుదుట పడే వరకు సామ్ దాదాపు ఏడాది విరామం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.సమంతపై మాయో సైటిస్ ప్రభావం ఇంకా కొనసాగుతోంది. ఆ వ్యాధి నుంచి సామ్ కోలుకున్నప్పటికీ మునుపటి ఫిట్ నెస్ సాధించేందుకు సామ్ అనేక ప్రయత్నాలు చేస్తోంది. యోగా, ఆధ్యాత్మిక యాత్రలు చేస్తోంది. అంతే కాదు జిమ్ లో కసరత్తులు చేస్తూ చెమటలు చిందిస్తోంది.తాజాగా సమంత జిమ్ లో అంత్యంత కష్టమైన వర్కౌట్స్ చేస్తున్న దృశ్యాలని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పంచుకుంది. ఎంత కష్టమైనప్పటికీ ఛాలెంజ్ గా తీసుకుని సామ్ వర్కౌట్స్ చేస్తోంది. ఈ దృశ్యాలు నెటిజన్లని కదిలిస్తున్నాయి. సమంత కి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

 సమంత పక్కనే జిమ్ ట్రైన్ జునైద్ ఉన్నాడు. సమంత వర్కౌట్స్ చేసేలా ఆమెని మోటివేట్ చేస్తున్నాడు. సమంత ఈ ఫొటోస్ లో బ్లాక్ టైట్ జిమ్ వేర్ ధరించి ఉంది.ఈ ఫొటోస్ లో సమంత ఫిట్ గానే కనిపిస్తోంది. అయితే మాయో సైటిస్ తర్వాత కొన్ని సమస్యలు తలెత్తాయని వాటిని అధికమించేందుకు ప్రయత్నిస్తునట్లు సామ్ గతంలో పేర్కొంది.సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంది. వరుసగా గ్లామర్ ఫొటోస్ షేర్ చేస్తూ పరువాల విందు వడ్డిస్తోంది.విజయ్ దేవరకొండ సరసన నటించిన ఖుషి చిత్రం పర్వాలేదనిపించే విధంగా సక్సెస్ అయింది. ఈ చిత్ర షూటింగ్ సమయంలో సమంత మాయోసైటిస్ కి గురికావడం కొన్ని నెలలు ఈ చిత్రం వాయిదా పడడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: