నానీని టెన్షన్ పెడుతున్న అనిమల్ !

Seetha Sailaja
సందీప్ వంగా రణబీర్ కపూర్ కాంబినేషన్ లో విడుదలకాబోతున్న ‘అనిమల్’ మ్యానియా టాలీవుడ్ ను కూడ షేక్ చేస్తోంది. వాస్తవానికి ఈమూవీ బాలీవుడ్ మూవీ అయినప్పటికీ ఈ మూవీకి దర్శకత్వం వహించింది సందీప్ వంగా కావడంతో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సగటు ప్రేక్షకుడుకి ఈ మూవీ పై ఆశక్తి బాగా పెరిగింది.

దీనికితోడు ఈసినిమాకు సంబంధించిన ట్రైలర్ తో పాటు ఈమూవీ పాటలకు విపరీతమైన స్పందన రావడంతో తెలుగు రాష్ట్రాలలో కూడ ఈమూవీకి భారీ ఓపెనింగ్స్ వచ్చే ఆస్కారం కనిపిస్తోంది. అంచనాలకు అనుగుణంగా ఈమూవీ బ్లాక్ బష్టర్ హిట్ అయితే ఈమూవీ మ్యానియా డిసెంబర్ 1 నుండి కనీసం రెండు వారాలు కొనసాగే ఆస్కారం కనిపిస్తోంది. ఇప్పుడు ఈ మ్యానియా డిసెంబర్ 7న విడుదల కాబోతున్న నాని ‘హాయ్ నాన్న’ మ్యానియాకు ఏమైనా అడ్డుకట్ట వేస్తుందా అన్న సందేహాలు కొందరికి వస్తున్నాయి.

వాస్తవానికి ఈ రెండు సినిమాల మూల కథ నాన్న సెంటిమెంట్ చుట్టూనే తిరుగుతుంది. ‘అనిమల్’ మూవీలో వైలెన్స్ ఎక్కువగా ఉంటే ‘హాయ్ నాన్న’ మూవీలో సున్నితమైన కూతురు సెంటిమెంట్ ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఈ రెండు కథలు నాన్న చుట్టూ తిరుగుతాయి. దీనితో ఒకే సెంటిమెంట్ తో వచ్చిన రెండు సినిమాలు వెంటవెంటనే కేవలం వారం రోజుల గ్యాప్ తో విడుదల అయితే ఎంతవరకు సగటు ప్రేక్షకుడు రెండు సినిమాలను ఒకేలా ఆదరిస్తాడు అన్న విషయమై ఇండస్ట్రీ వర్గాలకు సందేహాలు ఉన్నాయి.

అయితే ఈ రెండు సినిమాలకు సంబంధించిన పాటలకు ట్రైలర్స్ కు ఒకదానికి మించి ఒకటిగా స్పందన రావడంతో పాటు ఈ రెండు సినిమాల ప్రమోషన్ కూడ తారా స్థాయిలో జరుగుతూ ఉండటంతో ‘నాన్న’ సెంటిమెంట్ తో రాబోతున్న ఈ రెండు సినిమాలు హిట్ అయినా ఆశ్చర్యం లేదు అంటూ మరికొందరి అభిప్రాయం. పాన్ ఇండియా స్థాయిలో ‘అనిమల్’ విడుదల అవుతూ ఉంటే ‘హాయ్ నాన్న’ మాత్రం తెలుగు రాష్ట్రాల మార్కెట్ ను షేక్ చేయాలని నాని కష్టఅడుతున్నాడు..    




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: