ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 అనే మూవీ షూటింగ్ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే మైత్రి సంస్థ వారు భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూ ఉండగా ... పహాద్ ఫాజిల్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ మొదటి భాగానికి అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు రావడం ఈ సినిమాకు ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు రావడంతో ఈ మూవీ యొక్క రెండవ భాగంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా అవి అద్భుతమైన రీతిలో ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాను వచ్చే సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడం ... ఈ సినిమా రెండవ భాగము నుండి ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతమైన రీతిలో ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఇలా భారీ అంచనాలు జనాల్లో నెలకొని ఉన్న నేపథ్యంలో ఈ మూవీ.కి భారీ లెవెల్లో ప్రి రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ మూవీ కి దాదాపు 500 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నట్లు ఆ రేంజ్ లో ఇప్పటికే ఈ సినిమాకు ఆఫర్ లు కూడా వస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ మొదటి భాగంలోని నటనకు గాను అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డ్ కూడా దక్కింది.