రెబల్ స్టార్
ప్రభాస్ ప్రస్తుతం
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్
సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ
మూవీ కి
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ...
శృతి హాసన్ ఈ సినిమాలో
హీరోయిన్ గా నటిస్తోంది. ఈ
మూవీ మొత్తం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో భాగంగా ఈ
మూవీ మొదటి భాగం షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా ప్రస్తుతం ఈ
మూవీ కి సంబంధించిన రెండవ భాగం షూటింగ్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ
మూవీ యొక్క మొదటి భాగాన్ని ఈ సంవత్సరం
డిసెంబర్ 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ బృందం ప్రకటించింది.
ఇకపోతే ఈ సినిమాతో పాటు
ప్రభాస్ ప్రస్తుతం
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్ట్ కే
మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ
మూవీ షూటింగ్ కూడా ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఈ
మూవీ తో పాటు మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో కూడా
ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్నాడు. ఇలా ప్రస్తుతం మూడు
మూవీ ల షూటింగ్ లతో ఫుల్ బిజీగా ఉన్న
ప్రభాస్ మరి కొన్ని రోజుల్లోనే
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందబోయే స్పిరిట్ అనే సినిమాలో కూడా హీరోగా నటించబోతున్నాడు.
ఇకపోతే కొంతకాలం క్రితమే దర్శకుడు హను రాఘవపూడి ...
ప్రభాస్ కి ఓ కథ వినిపించినట్లు ఆ కథ అద్భుతంగా నచ్చడంతో హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో నటించడానికి
ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం వీరి కాంబో
మూవీ కి సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హను రాఘవపూడి ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేసినట్లు అందులో భాగంగా ఈ సినిమాలో
ప్రభాస్ కి జోడిగా
ప్రియాంక అరుల్
మోహన్ ను
హీరోయిన్ గా ఎంపిక చేసుకునే ఆలోచనలో ఈ దర్శకుడు ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.