ఏకంగా అన్ని వేల మంది డాన్సర్లతో "దేవర" మూవీ సాంగ్ షూటింగ్..?

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆఖరుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ద్వారా ఎన్టీఆర్ కి గ్లోబల్ గా క్రేజ్ లభించింది. ఇకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్ ... కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే భారీ బడ్జెట్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా నటిస్తూ ఉండగా ... బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న నటులలో ఒకరు అయినటువంటి సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు.


అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే మొత్తం ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ మూవీ మొదటి భాగాన్ని వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ దర్శకుడు కొరటాల శివ అధికారికంగా ప్రకటించాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.


అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు 200 మంది డాన్సర్ లతో దేవర మూవీ కి సంబంధించిన ఓ పాట షూటింగ్ ను జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ పాటకు "ఆర్ ఆర్ ఆర్" మూవీ లోని "నాటు నాటు" సాంగ్ కి కొరియో గ్రాఫర్ గా చేసినటువంటి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియో గ్రాఫర్ గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సాంగ్ ఈ మూవీ లోనే హైలెట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాపై ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: