మెగాస్టార్
చిరంజీవి ఈ ఏడాది ఆరంభం లోనే వాల్తేరు వీరయ్య
సినిమా తో బిగ్గెస్ట్
బ్లాక్ బస్టర్ అందుకున్నారు.. ఆ తరువాత
మెహర్ రమేష్ దర్శకత్వం లో భోళా
శంకర్ మూవీ తో ప్రేక్షకులను పలుకరించారు. ఆగష్టు 11 న రిలీజ్ అయిన భోళా
శంకర్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీనితో తన తరువాత
సినిమా ను ఓ యంగ్
డైరెక్టర్ తో చేస్తున్నారు మెగాస్టార్..'బింబిసార' సినిమాతో
బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్
డైరెక్టర్ వశిష్ట ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మెగా స్టార్ సినీ కెరీర్ లో ఈ
సినిమా 156 వ చిత్రంగా రూపొందుతుంది.. ఈ
సినిమా ను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇదొక భిన్నమైన అడ్వెంచర్ ఫాంటసీ
సినిమా గా తెరకెక్కుతుంది.ఈ చిత్రాని కి విశ్వంభర అనే పేరు పరిశీలన లో వున్నట్లు సమాచారం.. ఇదిలా ఉంటే ఈ
సినిమా నుంచి మరో ఆసక్తికరమైన న్యూస్ వైరల్ అవుతుంది.. ఇందు లో
చిరంజీవి పాత్ర పేరు భీమవరం దొరబాబు అని సమాచారం. భీమవరం నేపథ్యం లో ఈ
సినిమా మొదలవుతుందని, ఇందులో
చిరంజీవి లుక్ ఎంతో డిఫరెంట్ గా ఉంటుందని సమాచారం.దొరబాబు పాత్ర మంచి వినోదం తో కూడి ఉంటుదని తెలుస్తోంది.దొరబాబు పాత్ర నవ్వులుని పంచుతూనే మరో కొత్త
ఊహా ప్రపంచానికి తీసుకెళుతుందని, విజువల్ ఎఫెక్ట్స్ కి ప్రాధాన్యం ఉన్న ఈ
సినిమా లో ప్రేక్షకులను అలరించే ఎలిమెంట్స్ చాలానే ఉంటాయని సమాచారం. సోషియా ఫాంటసీ నేపథ్యం లో సాగే ఈ చిత్రానికి లెజెండరీ మ్యూజిక్
డైరెక్టర్ ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం
కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.తాజా గా నేడు ఈ
సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది.క్లాప్ బోర్డు ను చూపిస్తూ మెగా 156 సెట్స్ మీదకు వచ్చిందని మేకర్స్ అధికారికం గా ప్రకటించారు.