నాచురల్ స్టార్
నాని తాజాగా హాయ్
నాన్న అనే సినిమాలో హీరోగా నటించాడు. సౌర్యవ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్
హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాని
డిసెంబర్ 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున తెలుగు ,
తమిళ ,
కన్నడ , మలయాళ ,
హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ
సినిమా నుండి చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను మరియు కొన్ని పాటలను విడుదల చేసింది. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే తాజాగా ఈ
మూవీ బృందం ఈ సినిమాను "యూ ఎస్ ఏ" లో ఎవరు విడుదల చేయబోతున్నారు అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ
మూవీ యొక్క "యూ ఎస్ ఏ" హక్కులను ప్రత్యాoగారం ... ఏ ఏ క్రియేషన్స్ ఫణి ముత్యాల సంస్థలు సంయుక్తంగా దక్కించుకున్నాయి.
అందులో భాగంగా ఈ రెండు సంస్థలు ఈ సినిమాను "యూ ఎస్ ఏ" లో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే తాజాగా ఈ చిత్ర బృందం ఈ సినిమాను "యూ ఎస్ ఏ" లో
డిసెంబర్ 6 వ తేదీనే ప్రీమియర్స్ వేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకు ఈ
సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్నీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ
మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ
సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇకపోతే
నాని ఆఖరుగా
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన
దసరా అనే
మూవీ లో
హీరో గా నటించి మంచి విజయం అందుకున్నాడు. మరి ఈ సినిమాతో
నాని ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.