ఈ సంవత్సరం పఠాన్,
జవాన్ వంటి వరుస
ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న షారుక్ ఖాన్ దెబ్బకి
ప్రభాస్ పని అయిపోతుంది అని నార్త్
ఆడియన్స్ అంటుంటే..సలార్ దెబ్బకి డంకీ గల్లంతు అవుతుందని రెబల్
ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఈ రెండు సినిమాల్లో ఏది బాక్సాఫీస్ వద్ద పై చేయి సాధిస్తుంది? ఏ
సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది? అనేది తెలియాలంటే
డిసెంబర్ 21, 22 తేదీల దాకా వేచి చూడాల్సిందే. కాగా ఈ బాక్సాఫీస్
వార్ ని ఇంకాస్త హీట్ చేసేందుకు సలార్
మూవీ నుంచి ట్రైలర్ విడుదలవుతుంటే, డంకీ నుంచి డ్రాప్ 2 పేరుతో ఇంకో అప్డేట్ రానుంది. ఇక వీటిలో సలార్ ట్రైలర్
డిసెంబర్ 1న విడుదల కానున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు.దీంతో ఇప్పటికే సలార్ ట్రైలర్ కండౌన్ స్టార్ట్ అయిపోయింది. గత కొద్ది రోజులుగా సోషల్
మీడియా అంతా సలార్ మేనియాలో ఉండగా తాజాగా ఆ ప్లేస్ లో డంకీ
సినిమా ట్రెండింగ్ లోకి వచ్చింది.
డంకీ డ్రాఫ్ 2 పేరుతో ఈరోజు అనగా
నవంబర్ 22 న ఓ మెలోడీ సాంగ్ విడుదల అయ్యింది. విడుదల అయిన 3 గంటల్లోనే చార్ట్ బస్టర్ గా నిలిచి యూ ట్యూబ్ లో వ్యూస్ లైక్స్ తో బాగా దూసుకుపోతుంది.
బాలీవుడ్ టాప్ సింగర్ అర్జీత్ సింగ్ పాడిన ఈ పాట చాలా బాగా ఆకట్టుకుంటుంది.'డంకీ'
సినిమా విషయానికి వస్తే..టాలీవుడ్ లో
రాజమౌళి లాగే బాలీవుడ్లో అపజయం ఎరుగని దర్శకుడిగా పేరొందిన
రాజ్ కుమార్ హిరానీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నార్త్ లో ఈ మూవీపై ఎన్నో భారీ అంచనాలు ఉన్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ
మూవీ ఉండబోతోంది. ఇక సలార్
సినిమా విషయానికి వస్తే, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాకి
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. చాలాకాలం తర్వాత
ప్రభాస్ నటిస్తున్న యాక్షన్
సినిమా కావడంతో ఈ
సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.