అఫీషియల్ : "గూడచారి 2" లో హీరోయిన్గా ఆ ముద్దుగుమ్మ ఫిక్స్..!

Pulgam Srinivas
కొంత కాలం క్రితం అడవి శేషు హీరోగా గూఢచారి అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించడం మాత్రమే కాకుండా ఈ మూవీ లో అడవి శేషు నటనకు ... ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి శశి కిరణ్ తిక్క కి ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. ఇక ఓవరాల్ గా ఈ సినిమా భారీ కలెక్షన్ లను వసూలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకుంది.
 


ఇలా ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ కి కొనసాగింపుగా "జీ 2" అనే పేరుతో మరో మూవీ ని రూపొందిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో అడవి శేషు హీరోగా నటిస్తూ ఉండగా ... విజయ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోయే ముద్దు గుమ్మకు సంబంధించిన అప్డేట్ ను ప్రకటించారు. తాజాగా ఈ మూవీ మేకర్స్ బనిత సందు ఈ మూవీ లో హీరోయిన్ గా నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు.


ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే గూఢచారి మూవీ కి ఈ సినిమా కొనసాగింపుగా రూపొందడం వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న అడవి శేషు ఈ మూవీ లో హీరో గా నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా కూడా గూఢచారి రేంజ్ విజయాన్ని అందుకుంటుందో లేదో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: