అందాల ఆరబోతలో గేట్లు ఎత్తేస్తున్న మెగా డాటర్...!!
నిహారిక కొణిదెల.. యాంకర్‌గా కెరీర్ ని ప్రారంభించింది. ఆమె `ఢీ జూనియర్` షో ద్వారా బుల్లతెరపైకి ఎంట్రీ ఇచ్చింది. తన ఇన్నోసెన్స్‌తో, చలాకీతనంతో యాంకరింగ్‌ని అదరగొట్టింది. అయితే ఒకే షోకి పరిమితం అయ్యింది. ఆ తర్వాత నటిగా టర్న్ తీసుకుంది.నటనపై ఆసక్తితో ఆమె హీరోయిన్‌గా మారింది. నాగశౌర్యతో కలిసి `ఒకమనసు` సినిమాలో నటించింది. కానీ మూవీ ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీసు వద్ద డీలా పడింది. ఆ తర్వాత తమిళంలోనూ ఓ సినిమా చేసింది. అది కూడా పెద్దగా ఆదరణ పొందలేదు. మరోవైపు `హ్యాపీ వెడ్డింగ్` సినిమా చేసింది. ఇది కూడా సేమ్ రిజల్ట్.ఇక ఈ క్రమంలో `సూర్యకాంతం` అనే మరో ప్రయత్నం చేసింది. రాహుల్ విజయ్‌తో కలిసి చేసిన ఈ మూవీ కూడా మెప్పించలేకపోయింది. ఇలా బ్యాక్ టూ బ్యాక్ నిహారికకి పరాజయాలు వెంటాయి. దీంతో పెదనాన్న చిరంజీవి నటించిన `సైరా`లోనూ మెరిసింది. కానీ మళ్లీ డిజప్పాయింట్‌మెంట్. దీంతో సినిమాలకే గుడ్ బై చెప్పింది నిహారిక.ఆ తర్వాత ఆమె ప్రొడక్షన్‌పై ఫోకస్ పెట్టింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్స్ చేసింది. `నాన్న కూచి`, `ముద్దపప్పు ఆవకాయి`, `మ్యాడ్ హౌజ్`, `ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ`, `హెలో వరల్డ్`, `డెడ్ ఫిక్సెల్స్` వంటి సిరీస్‌లు నిర్మించింది. ప్రొడ్యూసర్‌గా సక్సెస్ అయ్యింది. దీంతో ఇప్పుడు కొత్త ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది. యంగ్ టీమ్‌తో కలిసి ఆమె మొదటిసారి సినిమాని నిర్మిస్తుండటం విశేషం.