తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటుడుగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న పంజా వైష్ణవ్ తేజ్ తాజాగా ఆది కేశవ అనే సినిమాలో హీరోగా నటించాడు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని శ్రీ లీల హీరోయిన్ గా నటించగా ... జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే ఈ మూవీ ని నవంబర్ 24 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి అనేక ప్రచార చిత్రాలను మరియు కొన్ని పాటలను విడుదల చేశారు. వీటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.
ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు సంబంధించిన అధికారిక ప్రకటనలను విడుదల చేసింది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ట్రైలర్ ను లాంచ్ ను ఈవెంట్ ను నవంబర్ 20 వ తేదీన సాయంత్రం 4 గంటలకు "ఏ ఎం బి" సినిమా స్క్రీన్ 1 హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇకపోతే ఉప్పెన మూవీ తో అద్భుతమైన విజయం అందుకున్న వైష్ణవ్ ఆ తర్వాత కొండపొలం ... రంగ రంగ వైభవంగా సినిమాలతో వరుసగా అపజాయలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. మరి ఆదికేశవ మూవీ తో ఏ స్థాయి విజయాన్ని ఈ యువ నటుడు సొంతం చేసుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.