వందరోజులను కంప్లీట్ చేసుకున్న "జైలర్" మూవీ..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజాగా జైలర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో రజనీ కి భార్య పాత్రలో రమ్యకృష్ణ నటించగా ... నెల్సన్ దిలీప్ కుమార్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ సినిమాలో తమన్నా ... సునీల్ కీలక పాత్రలలో నటించారు. ఇకపోతే ఈ మూవీ భారీ అంచనాల నడుమ ఈ సంవత్సరం ఆగస్టు 10 వ తేదీన తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. ఇకపోతే ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది.


 దానితో ఈ మూవీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టి తమిళ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇకపోతే ఈ మూవీ కంటే ముందు రజిని నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రేక్షకులను అలరించలేదు. ఇక ఈ సినిమా అదిరిపోయి రేంజ్ లో బ్లాక్ బస్టర్ విజయం కావడంతో రజిని అభిమానులు కూడా ఈ సినిమా విజయంతో ఫుల్ ఖుషి అయ్యారు. ఇకపోతే రజనీ కి అదిరిపోయి రేంజ్ విజయాన్ని తీసుకువచ్చిన ఈ సినిమా ఈ రోజుతో సక్సెస్ ఫుల్ గా 100 రోజులను కంప్లీట్ చేసుకుంది.


ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయం సాధించిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితం నుండే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ కి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కూడా ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇకపోతే జైలర్ మూవీ ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానితీ మారన్ చాలా భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఇకపోతే ప్రస్తుతం రజనీ కాంత్ వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: