ఇండియా వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో మొదటి భాగం యొక్క పనులు ఇప్పటికే చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క మొదటి భాగాన్ని ఈ సంవత్సరం డిసెంబర్ 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తి అయినట్లు తెలుస్తోంది.
ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క ట్రైలర్ ను డిసెంబర్ 1 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ట్రైలర్ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క రన్ టైమ్ ను లాక్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని 2 గంటల 55 నిమిషాల భారీ నిడివి తో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... జగపతి బాబు , పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించారు. ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాలి.