లేడీ సూపర్ స్టార్ ఆస్తులు ఎంతో తెలుసా....??

murali krishna
నయనతార.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సౌత్‌ ఇండియాలో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోందీ బ్యూటీ. 2003లో వచ్చిన మనసునక్కరే అనే తో ఇండస్ట్రీకి పరిచయమైన నయన్‌ 2005లో వచ్చిన గజిని చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకపోయింది.తమిళంతోపాటు తెలుగులోనూ వరుస విజయాలను అందుకుందీ బ్యూటీ. అటు కోలీవుడ్‌తో పాటు, ఇటు టాలీవుడ్‌లోనూ దాదాపు అందరు అగ్ర హీరోల సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకుందీ చిన్నది. వివాహం తర్వాత కూడా వరుస ఆఫర్లను దక్కించుకుంటూ, భారీ రెమ్యునరేషన్‌ తీసుకుంటోంది. మొన్నటి మొన్న జవాన్‌ చిత్రంతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఉమెన్‌ ఓరియెంటెడ్‌ మూవీస్‌లో కూడా నటించి మెప్పించిందీ చిన్నది. ఇలా వరుస లతో దూసుకుపోతున్న నయన్‌ రెమ్యునరేషన్‌తో పాటు, తన బ్యాంక్‌ బ్యాలెన్స్‌ను కూడా పెంచుకుంటూ పోతోంది.

నవంబర్ 18 (శనివారం)వ తేదీతో నయన తార 39వ పడిలోకి అడుగుపెడుతోన్న నేపథ్యంలో నయనతారకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి.? ప్రస్తుతం ఈ బ్యూటీ కు ఎంత రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నారు.? లాంటి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. నయనతార చివరగా నటించిన చిత్రం జవాన్‌కు ఏకంగా రూ. 10 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం నయనతార మొత్తం ఆస్తుల విలువ ఏకంగా రూ. 183 కోట్లు అని ఓ అంచనా.ఇక నయనతార ఆస్తుల విషయానికొస్తే.. ఈ బ్యూటీకి హైదరాబాద్‌లో రెండు ప్రీమియం అపార్ట్‌మెంట్స్ ఉన్నట్లు సమాచారం. ఈ అపార్ట్‌మెంట్స్‌లో ప్రీమియం 5 స్టార్‌ హోటల్‌లోని సూట్‌లకు సమానమైన ఇంటీరియర్‌తో రూపొందించినవి వచ్చాయి. హైదరాబాద్‌లో అత్యంత విలాసవంతమైన బంజారిహిల్స్‌లో ఈ రెండు అపార్ట్‌మెంట్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అపార్ట్‌మెంట్ మార్కెట్ విలువ రూ. 15 కోట్ల వరకు ఉండొచ్చని ఓ అంచనా. ఇక నయన్‌కు కేరళలో ఆమెకు పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి కూడా ఉంది. అలాగే చెన్నైలో విలాసవంతమైన ఇల్లు నయన్‌కు ఉంది. దీని విలువ అక్షరాల రూ. 100 కోట్లు అని అంచనా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: