మాస్ మహారాజా రవితేజ మరికొన్ని రోజుల్లోనే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు. ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మించనున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ను ఈ నెల 23 వ తేదీ నుండి హైదరాబాద్ లో ఈ మూవీ బృందం వారు స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క మొదటి షెడ్యూల్ ను భారీ ఎత్తున ప్లాన్ చేసినట్లు ఇందులో ఈ సినిమాకు సంబంధించిన చాలా కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది.
అలాగే ఈ షెడ్యూల్ ను చాలా ఎక్కువ రోజులు పాటు ప్లాన్ చేసినట్లు అందులో కొన్ని రోజులు రవితేజ ఉన్న సన్నివేశాలను అలాగే రవితేజ లేని సన్నివేశాలను కూడా ఈ షెడ్యూల్ లో చిత్ర బృందం చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే చాలా రోజులుగా ఈ మూవీ లో ఫలానా నటి హీరోయిన్ గా నటించబోతుంది అని అనేక మంది పేర్లు తెరపైకి వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ మేకర్స్ తాజాగా ఈ సినిమాలో రవితేజ పక్కన హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
తాజాగా ఈ ముద్దు గుమ్మకు ఈ సినిమా దర్శకుడు గోపీచంద్ కథను వినిపించగా ఆ కథ విని చాలా ఎగ్జైట్ అయిన ఈనటి వెంటనే ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ లో ప్రియాంక హీరోయిన్ గా నటించబోతున్న విషయాన్ని ఈ మూవీ మేకర్స్ మరికొన్ని రోజుల్లోనే అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికే రవితేజ ... గోపీచంద్ కాంబినేషన్ లో డాన్ శీను , బలుపు , క్రాక్ మూవీ లు రూపొందాయి. ఇది వీరి కాంబినేషన్ లో నాలుగవ సినిమా.