రష్మిక వీడియో పై రియాక్ట్ అయినా ఎక్స్ లవర్....!!

murali krishna
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో ఇటీవలే దుమారం రేపింది. ఒక్కసారిగా డీప్‍ఫేక్ అంశం హాట్ టాపిక్‍గా మారింది.డీప్‍ఫేక్‍పై సినీ సెలెబ్రిటీలు చాలా మంది స్పందించారు. రష్మికకు మద్దతు తెలిపారు. తాజాగా, రష్మిక డీప్‍ఫేక్ వీడియో గురించిన అంశంపై ఆమె మాజీ ప్రియుడు, కన్నడ హీరో రక్షిత్ శెట్టి స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ అంశం గురించి మాట్లాడారు.'సప్తసాగరాలు దాటి- సైడ్ బీ' చిత్రం కోసం తెలుగులోనూ ప్రమోషన్లను జోరుగా చేస్తున్నారు హీరో రక్షిత్ శెట్టి. ఈ క్రమంలో ఓ తెలుగు యూట్యూబ్ ఛానెల్‍కు ఇంటర్వ్యూ ఇచ్చారు. రష్మిక ఫేక్ వీడియో ఇటీవల బయటికి వచ్చిందని, ఇది చాలా బాధాకరమని, ఈ విషయంపై మీరేం చెప్పాలనుకుంటున్నారు అనే ప్రశ్న రక్షిత్ శెట్టికి ఎదురైంది. దీనికి ఆయన స్పందించారు.డీప్‍ఫేక్‍కు సంబంధించిన సాఫ్ట్ వేర్లు అందరికీ అందుబాటులో ఉండకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రక్షిత్ శెట్టి అభిప్రాయపడ్డారు. సరైన లైసెన్సులు ఉండేలా చేయాలని చెప్పారు. "ఇది ఇంకా ఎక్కువ కాకముందే ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సాఫ్ట్ వేర్లు అందరికీ అందుబాటులో ఉండకుండా చేయాలి. ఇలాంటి రూల్స్ తప్పకుండా చేయాలి. అలాగే ప్రతీ సాఫ్ట్ వేర్ కూడా సరైన లైసెన్సుతో ఉండేలా చేయాలి" అని రక్షిత్ శెట్టి చెప్పారు.

తెలుగు ఇండస్ట్రీలో తనకు చిరంజీవి అంటే చాలా ఇష్టమని రక్షిత్ శెట్టి చెప్పారు. అలాగే, జూనియర్ ఎన్టీఆర్ చేసే డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని అన్నారు. రానా కూడా తనకు ఫేవరెట్ అని చెప్పారు. ఇక, రష్మిక ఎప్పుడు గొప్పగా కలలు కనే వారని చెప్పారు.రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ హీరోహీరోయిన్లుగా నటించిన సప్తసారగాలు దాటి సైడ్-బీ చిత్రం రేపు (నవంబర్ 17) థియేటర్లలో రిలీజ్ కానుంది. సైడ్-ఏకు ఇది కొనసాగింపుగా వస్తోంది.రక్షిత్ శెట్టి, రష్మిక మందన్న 2016లో కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమా చేశారు. ఆ సమయంలో ఇద్దరూ ప్రేమించుకున్నారు. 2017లో ఎంగేజ్‍మెంట్ చేసుకున్నారు. అయితే, ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో 2018లో వీరు విడిపోయారు.అయితే, తాను విడిపోయినా ఇప్పటికీ రష్మికతో టచ్‍లోనే ఉన్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రక్షిత్ చెప్పారు. తాను, రష్మిక అప్పుడప్పుడు మెసేజ్‍లు చేసుకుంటామని తెలిపారు. తమ సినిమాల రిలీజ్ సమయంలో విషెస్ చెప్పుకుంటామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: