రైడింగ్ లో దొరికిన యాంకర్ సుమ కొడుకు.. వీడియో వైరల్..!!

Divya
యాంకర్ సుమ కొడుకు ఇటీవలే హీరోగా బబుల్ గమ్ అనే సినిమాతో తెలుగు తెరకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సందర్భంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రోషన్ పాల్గొంటూ ఉంటున్నారు. అయితే ఇప్పుడు తాజాగా రోషన్ ఎన్నికల రైడింగ్లో దొరికినట్లుగా అతని కారులో కొన్ని సూట్ కేసులు ఉన్నట్లుగా ఒక విషయం వైరల్ గా మారుతున్నది. స్నేహితులతో పాటు కారులో వెళుతున్న రోషన్ ని పోలీసులు ఆపి చెక్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయం గురించి ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.


రోషన్ తన స్నేహితులతో కలిసి కారులో రైడింగ్ కి వెళుతూ ఉండగా పోలీసులు ఆపడం జరిగింది. అయితే రోషన్ తోపాటు అతని స్నేహితులకు కూడా సరైన సమాధానాలు చెప్పలేకపోవడంతో పాటు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి తప్పించుకోవాలని పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఈ వీడియోలో చూపించారు. అయితే చివరికి కారు డిక్కి ఓపెన్ చేయించి కారు డిక్కీలో ఉన్న సూట్ కేసులను ఓపెన్ చేయమని పోలీసులు అరవగా.. వాటిని ఓపెన్ చేయకుండా ఉండేందుకు పోలీసులతో డీల్ మాట్లాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు పోలీసులు మాత్రం వినకుండా ఖచ్చితంగా వాటిని ఓపెన్ చేయాలని పట్టుబడడంతో చేసేదేమీ లేక ఓపెన్ చేస్తారు.


కానీ చివరికి వాటిని ఓపెన్ చేసిన తర్వాత పోలీసులు అందులో ఉండేవి చూసి ఒకసారిగా షాక్ అవుతారు ఈ సూట్ కేసులు జిలేబి బబుల్ గమ్స్ వంటివి కనిపిస్తాయి.. ఇప్పటికే ఈ విషయం అందరికీ అర్థమయ్యే ఉంటుంది తాను నిజంగానే రైడ్ లో దొరకలేదని ఇదంతా కేవలం సినిమా ప్రమోషన్స్ కోసమే అన్నట్లుగా తెలుస్తోంది. గతంలో కూడా యాంకర్ సుమ ఇలాంటివి ఎన్నో చేసిందని చెప్పవచ్చు. ఇప్పుడు తాజాగా తన కొడుకు రోషన్ నటిస్తున్న బబుల్ గమ్ సినిమా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇలా రైట్లు దొరికినట్లు నమ్మించే వీడియోని సైతం షేర్ చేయడం జరిగింది. ఈ చిత్రానికి డైరెక్టర్ రవికాంత్ దర్శకత్వం వహించగా హీరోయిన్గా మానస చౌదరి నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: