సూపర్ హిట్ సినిమాకు, సూపర్ హిట్ కాన్సెప్ట్ వల్ల ఎప్పుడూ మరో
సినిమా రావడానికి రెడీగా ఉంటుంది. ఒకప్పుడు టాలీవుడ్‌లో సీక్వెల్ అంటే
డైరెక్టర్ లు భయపడేవాళ్లు.ఎందుకంటే సరైన విజయం దక్కకుండా అలాంటి సినిమాలు ఇబ్బంది పెట్టేవి.అయితే ఇప్పుడు మాత్రం అందుకు భిన్నం. ఎందుకంటే పరిస్థితి మారుతోంది.ఈరోజుల్లో హిట్ సినిమాలు ఖచ్చితంగా రెండు ముక్కలవుతున్నాయి. సీక్వెల్స్, ఫ్రాంచైజీలు ఎక్కువగా వస్తున్నాయి. తాజాగా 'మంగళవారం' సినిమాకుకి కూడా ఓ ఫ్రాంచైజీ లాంటిది సిద్ధం చేస్తున్నారట. అయితే దానికి ఏం పేరు ఉంటుంది అనేది చెప్పలేం అంటున్నారు మేకర్స్.టాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు పార్ట్ 2, సీక్వెల్, ప్రీక్వెల్ ఇంకా ప్రాంచైజీ అంటూ ప్లానింగ్ చేసుకునే తీసుకొస్తున్నారు. మొదటి
సినిమా ఫలితం తేడా కొడితే ఆ ఆలోచన పక్కకు వెళ్లిపోతుంది. 'పెదకాపు', 'స్కంద' సినిమాలు అలాంటివే. అయితే ఇప్పుడు టాలీవుడ్‌లో 'మంగళవారం'
సినిమా కూడా అలానే రాబోతోంది.
ఈ
సినిమా ప్రచారంలో భాగంగా 'మంగళవారం' దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ ఈ సినిమాకు పార్ట్ 2 ఉండబోతుంది అని ఆయన చెప్పారు.'మంగళవారం' సినిమాకు ఖచ్చితంగా పొడిగింపు ఉంటుంది. అయితే సీక్వెలా, ప్రీక్వెలా, ఫ్రాంచైజీనా అనేది మాత్రం ఇంకా తెలియదు. సినిమాకి ఖచ్చితంగా కొనసాగింపు అయితే ఉంటుంది అని అజయ్ భూపతి చెప్పారు. ఇప్పటికే 'మంగళవారం' సినిమాలో ఓ డిఫరెంట్ పాయింట్ ని చెబుతున్నాం అని టీమ్ చెబుతోంది. అంతేకాదు భయపెడుతూ, ఏడిపించేలా ఈ
సినిమా ఉంటుంది అని కూడా వారు చెప్పారు. దీంతో పాయింట్ ఏంటి అనే కుతూహలం అందరిలో ఉంది. పైగా దానికి తోడు దర్శకుడు అజయ్ భూపతి వైవిధ్యం మీద కూడా నమ్మకం ఉంది.ఒకవేళ పాయింట్ ఆసక్తికరంగా లేకపోయినా,
సినిమా సరైన ఫలితం అందుకోకపోయినా సినిమాకు కొనసాగింపు అనేది ఉండకపోవచ్చు. కాబట్టి ఈ విషయంలో ఈ నెల 17న అసలు క్లారిటీ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆ రోజే 'మంగళవారం'
సినిమా థియేటర్లలోకి వస్తుంది. మరి ఆ రోజు పాయల్ రాజ్‌పుత్ ఎంతవరకు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందో అనేది చూడాలి.