12 కిలోలు తగ్గాను.. బిగ్ బాస్ లో ఫుడ్ కష్టాలపై సందీప్ షాకింగ్ కామెంట్స్?
అయితే బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతూ 8 వారాలపాటు మనుగడ సాగించిన సందీప్ మాస్టర్.. చివరికి ఎనిమిదో వారంలో హౌస్ నుంచి బయటకు వచ్చేసాడు. అయితే ఇలా హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ కూడా ఆ తర్వాత ఎక్కడ చూసినా ఇంటర్వ్యూలలో దర్శనం ఇవ్వడం చేస్తూ ఉంటారు ఇక సందీప్ మాస్టర్ కూడా చాలానే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు అని చెప్పాలి. ఇందులో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ మాస్టర్ బిగ్ బాస్ గురించి షాకింగ్ విషయాలను తెలియజేశాడు.
మరీ ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లో ఫుడ్ కష్టాల గురించి ఈయన చెప్పిన విషయాలు.. అయితే అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి. బిగ్బాస్ హౌస్ లో ఉన్నప్పుడు బ్రేక్ ఫాస్ట్ వచ్చేది కాదు అంటూ తెలిపాడు. నైట్ ఏదైనా మిగిలినప్పుడు దానిని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటామని.. మరుసటి రోజు దానినే తింటాం అంటూ తెలిపాడు. అయితే నాకు ఉదయం పూట రైస్ తినే అలవాటు లేకపోవడంతో. ఇక రైస్ కి బదులుగా ఏదో ఒక ఫ్రూట్ తినేవాడిని.. ఇక ఫుడ్ కి కావలసినటువంటి గ్రోసరీ కూడా రాదు. అందుకే ఇక ఆహారం కి సరిపోయే కూరలు కూడా తయారు చేసుకోలేం. ఉన్నదాంట్లోనే అడ్జస్ట్ చేసుకుని తినాలి. బిస్కెట్ ప్యాకెట్, బ్రెడ్ ఇలా అన్ని అడ్జస్ట్ చేసుకుని తినాలి. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత 12 కిలోలు తగ్గిపోయాను అంటూ సందీప్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.