మంగళ వారం క్లైమాక్స్ పై షాకింగ్ న్యూస్ !

Seetha Sailaja
దీపావళి సినిమాల హడావిడి పూర్తి అయింది. ఈ సంవత్సరం దీపాళికి తెలుగు సినిమాల విడుదల లేకపోయినా ‘జపాన్’ ‘జిగర్‌తండ డబుల్‌ఎక్స్’ ‘టైగర్-3’ సినిమాలు భారీ పబ్లిసిటీతో విడుదల అయినప్పటికీ ఆసినిమాలకు పూర్తి నెగిటివ్ టాక్ రావడంతో ఈ మూడు సినిమాలు ఫ్లాప్ ల లిస్టులో చెరిపోయాయి.



దీనితో ఈ శుక్రు వారం విడుదల కాబోతున్న ‘మంగళవారం’ సంచలనాలు సృష్టిస్తుందా అన్న సందేహాలు చాలమందికి ఉన్నాయి. పేరుకు ఇది చిన్న సినిమా అయినప్పటికీ ‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతి సినిమా కావడంతో ఈ మూవీ అనుకోని విజయాన్ని సాధించే ఆస్కారం ఉంది అని కొందరు భావిస్తున్నారు. ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ దర్శకుడు అజయ్ భూపతి ఈ మూవీని ఫ్రాంఛైజీగా మార్చి ఇదే వరుసలో సినిమాలు తీస్తానని చెప్పడం మరింత షాకింగ్ గా మారింది.



‘‘మంగళవారం సినిమాకు కొనసాగింపుగా కొన్ని సినిమాలు వస్తాయి. రాబోయే చిత్రం ప్రీక్వెలా, సీక్వెలా, ఇంకోటా అనేది చెప్పలేను. కానీ ‘మంగళవారం’ వరల్డ్ మాత్రం కొనసాగుతుంది. దీన్నొక ఫ్రాంఛైజీగా మారుస్తా’అంటూ అజయ్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇదే సందర్బంలో మరొక విషయాన్ని బయటపెడుతూ ఈసినిమా టైటిల్ గురించి కొన్ని ఆశక్తికర విషయాలు తెలియచేశాడు.



‘‘మంగళవారాన్ని కొందరు చెడ్డ రోజుగా చూస్తారు. కానీ అది శుభప్రదమైన రోజు. గతంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం తెలుగు వారికి మంగళవారం సెలవు రోజుగా ఉండేది. బ్రిటిషర్లు వచ్చి ఆదివారాన్ని సెలవుగా మార్చిన విషయాన్ని తెలియచేశాడు, ‘మంగళవారం’ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేయగానే దర్శకుడు పెద్ద వంశీ తనకు ఫోన్ చేసి తనను అభినందించిన విషయాన్ని బయటపెడుతూ అలాంటి గొప్ప దర్శకుడి ప్రశంసలు తనకు ఎంతో స్పూర్తిని కలిగించాయి అని అంటున్నాడు.   ఇక ఈ సినిమాలో చివరి 45 నిమిషాలు తీవ్ర ఉత్కంఠభరితంగా ఉంటుందని ట్విస్టుల మీద ట్విస్టులుంటాయని చెపుతూ ఈసినిమా పై అంచనాలు పెంచుతున్నాడు..




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: