వెన్నెల కిశోర్.ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం
వెన్నెల కిషోర్ టాలీవుడ్ లో టాప్
కమెడియన్ గా రానిస్తున్నారు.వెన్నెల కిషోర్.తనదైన
కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు.వెన్నెల సినిమాతో తన కెరీర్ ను మొదలు పెట్టిన ఆయన అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో
కమెడియన్ గా తనదైన
కామెడీ తో ప్రేక్షకులను నవ్వించారు.
కమెడియన్ గానే కాకుండా దర్శకుడి గా అలాగే హీరోగా కూడా రాణించారు.ఇప్పుడు ఆయన హీరోగా ఓ చిత్రంలో నటిస్తున్నారు.. స్పై యాక్షన్
కామెడీ జోనర్లో ‘చారి 111’ అనే
సినిమా ను చేస్తున్నారు. గతంలో ఈ చిత్ర అనౌన్స్మెంట్ ను చిత్ర యూనిట్ ఓ వీడియో రూపంలో తెలియజేసింది.చారి 111 చిత్రంలో స్పై ఏజెంట్గా ప్రధాన పాత్రలో
వెన్నెల కిశోర్ నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రసాద రావుగా
మురళీ శర్మ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.అలాగే సంయుక్త విశ్వనాథన్ మరియు మహీగా ప్రియామాలిక్
హీరోయిన్ లుగా నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని ‘మళ్లీ మొదలైంది’ ఫేమ్
డైరెక్టర్ టీజీ
కీర్తి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సిమోన్ కే
కింగ్ సంగీతం అందిస్తున్నారు.స్పై ఏజెంట్ గా కన్ఫ్యూజ్ అవుతూ.. నవ్వించేలా
వెన్నెల కిషోర్ క్యారెక్టర్ ఈ సినిమాలో ఉంటుందని అనౌన్స్మెంట్ వీడియో ద్వారా మేకర్స్ తెలియజేశారు.. కామిక్లా వున్న ఆ అనౌన్స్మెంట్ వీడియోకు
కమెడియన్ సత్య వాయిస్ ఓవర్ ను ఇచ్చారు. ‘చారి 111’ క్యారెక్టర్ గురించి ఈ వీడియోలో వివరించారు. అలాగే కొన్ని పాత్రలను కూడా పరిచయం చేశారు.స్పై ఏజెంట్ గా తన యాక్షన్ విన్యాసాలతో
టాలీవుడ్ ప్రేక్షకుల్ని అలరించేందుకు వెన్నెలకిషోర్ సిద్ధం అవుతోన్నాడు.ఇదిలా ఉంటే తాజాగా చారి 111
మూవీ ఫస్ట్ లుక్ను మంగళవారం రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో వెన్నెలకిషోర్ ఏజెంట్ లుక్ లో కనిపించాడు.స్పైగా రివాల్వర్ గురిపెట్టి సీరియస్ లుక్లో కనిపించాడు. బ్యాక్గ్రౌండ్లో
జేమ్స్ బాండ్ కారుతో పాటు
హైదరాబాద్ సిటీలో భారీ బిల్డింగ్లు మంటల్లో కాలిపోతున్నట్లుగా చూపించడం ఆసక్తిని పెంచుతుంది.