ఆ మూవీలో ఏఎన్నార్ ధరించిన కళ్లద్దాలకు అంత ఇంపార్టెన్స్ ఉందా...??
ఈ సినిమాలోని కల నిజమాయేగా సాంగ్ కోసం ఏఎన్నార్ నలుచదురం కళ్లద్దాలను ధరించి కనిపించారు. ఏఎన్నార్ ధరించిన కళ్లద్దాలు అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి. సంసారం సినిమా సక్సెస్ సాధించగా ఈ కళ్లజోడు సృష్టించిన ట్రెండ్ మామూలు ట్రెండ్ కాదు. మయో ఆప్టికల్స్ నుంచి అప్పట్లో ఏకంగా 5000 కంటే ఎక్కువగా ఏఎన్నార్ ధరించిన కళ్లజోడు లాంటి కళ్లజోళ్లు అమ్ముడయ్యాయంటే వీటికి ఎంత క్రేజ్ ఏర్పడిందో తెలుస్తుంది.
ఏఎన్నార్ చివరి సినిమా మనం కాగా ఈ జనరేషన్ ఫ్యాన్స్ కు సైతం ఈ సినిమా ఎంతో నచ్చింది. అక్కినేని అభిమానులు ఈ సినిమా గురించి చాలా సందర్భాల్లో ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు. నాగచైతన్య సైతం ఒక సందర్భంలో తను నటించిన సినిమాలలో ఈ సినిమా అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు. అక్కినేని హీరోలకు ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ దక్కడం లేదు. భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో అక్కినేని హీరోలకు ఆ లోటు తీరాలని అభిమానులు కోరుకుంటున్నారు.