ఆ పాత్రను చేయకూడదనుకున్న రమ్యకృష్ణ....!!
“ఆ సినిమాలో నేను చాలా తల పొగరుతో నటించాల్సి ఉంది. అలాంటి తల పొగరుతో ప్రవర్తించడం నాకు ఇష్టం ఉండదు. అయితే అది సినిమాలో ఒక పాత్రే అని నాకు తెలుసు. కానీ అలా ప్రవర్తిస్తూ నటించడానికి మొదటిలో నా మనసు ఒప్పుకోలేదు. దీంతో ఆ పాత్ర చేయకూడదు అనుకున్నాను. ఒకవేళ దర్శకుడు నన్ను సౌందర్య పాత్ర కావాలా? నీలాంబరి పాత్ర కావాలా? అని అడిగి ఉంటే.. నేను సౌదర్య పాత్ర కావాలని చెప్పేదాన్ని. కానీ అలా జరగలేదు. ఏదేమైనా చివరికి దర్శకుడు విజన్ నమ్మి ఆ పాత్ర చేయడానికి ఒప్పుకున్నాను. ఆయన చెప్పినట్లు ఆ పాత్రని చేశాను. అయితే సినిమాలో ఒక సన్నివేశంలో సౌందర్య ముఖంపై నేను కాలు పెట్టే సీన్ ఉంటుంది. అది చేయడానికి నేను చాలా ఇబ్బంది పడ్డాను” అంటూ చెప్పుకొచ్చారు.సూపర్ హిట్ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ ‘నరసింహ చిత్రాన్ని’ తెరకెక్కించారు. ఇక ఈ సినిమా తమిళ్, తెలుగు భాషల్లో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే.