లేత గులాబీ చీరలో అదిరిపోయే ఫోజులిచ్చిన అషురెడ్డి....!!
అషురెడ్డికి బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపైతే దక్కింది. అదే క్రేజ్ తో ప్రస్తుతం సినిమాలు, టీవీ షోల్లో సందడి చేస్తోంది. బుల్లితెరపై అప్పుడప్పుడు మెరుస్తూ టెలివిజన్ ప్రేక్షకులను అలరిస్తోంది. తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటోంది.ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో అషురెడ్డి ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. ఇంట్రెస్టింగ్ గా పోస్టులు పెడుతూ అట్రాక్ట్ చేస్తుంటుంది. మరోవైపునయా లుక్స్ లో మెరుస్తూ మైమరిపిస్తు వస్తోంది.
ఈ ముద్దుగుమ్మ పండుగలు, ప్రత్యేకమైన రోజుల్లో మాత్రం సంప్రదాయ లుక్ లో దర్శనమిస్తూ ఆకర్షించుకుంటోంది. తాజాగా దీపావళి లుక్ లో మంత్రముగ్ధులను చేసింది. బ్యూటీపుల్ శారీలో మరింత అందాన్ని సొంతం చేసుకుంది.లేత గులాబీ చీరలో మెరిసిన అషురెడ్డి అదిరిపోయే ఫోజులిచ్చింది. బ్యూటీఫుల్ లుక్ తో పాటు క్యూట్ స్టిల్స్ తో కట్టిపడేసింది. చీరకట్టుకు తోడు ఆకర్షణీయమైన జ్యూయెల్లరీ ధరించి మరింత అందాన్ని పోగేసుకుంది. ఈ సందర్భంగా ఇంటిముంగిట దీపాలు వెలిగిస్తూ అచ్చు తెలుగుమ్మాయిలా ఆకట్టుకుంది.అషురెడ్డి నిండుగా సంప్రదాయ దుస్తుల్లో కనిపించడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. ట్రెడిషనల్ లుక్ లో ఎంత బాగుందో అంటూ కామెంట్ల రూపంలో ఆకాశానికి ఎత్తుతున్నారు. లైక్స్ తో పిక్స్ ను వైరల్ చేస్తున్నారు. ఇక అషురెడ్డి ప్రస్తుతం A master Piece అనే చిత్రంలో నటిస్తోంది.