రవితేజ నెక్స్ట్ మూవీలో హీరోయిన్ గా ఆ క్రేజీ బ్యూటీ ఫిక్స్..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి రవితేజ తాజాగా టైగర్ నాగేశ్వరరావు అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా మూవీ గా విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరించలేకపోయింది. దానితో ఈ మూవీ యావరేజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇకపోతే ప్రస్తుతం రవితేజ "ఈగల్" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నారు.


అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత రవితేజ ... గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. ఈ సినిమాను మైత్రి సంస్థ వారు నిర్మించబోతున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన అనేక వివరాలను ఇప్పటికే ఈ చిత్ర బృందం విడుదల చేసినప్పటికీ ఈ సినిమాలో రవితేజ పక్కన హీరోయిన్ గా నటించబోయే ముద్దుగుమ్మకు సంబంధించిన అధికారిక ప్రకటనను మాత్రం ఈ మూవీ మేకర్స్ ప్రకటించలేదు. ఇకపోతే రవితేజ ఆఖరుగా నటించిన చాలా సినిమాలలో కూడా మీడియం రేంజ్ హీరోయిన్ లతో ... చిన్న హీరోయిన్ లతో మాత్రమే నటిస్తూ వస్తున్నాడు. దానితో ఈ సినిమాలో రవితేజ పక్కన స్టార్ హీరోయిన్ ని తీసుకోవాలి అనే ఆలోచనలో మూవీ మేకర్స్ ఉన్నట్లు అందులో భాగంగా ఓ స్టార్ హీరోయిన్ కోసం వెతుకులాటలో ఈ చిత్ర బృందం ఉన్నట్లు వార్తలు వచ్చాయి.


ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం ప్రియాంక అరుల్ మోహన్ ను ఈ సినిమాలో హీరోయిన్ గా కన్ఫామ్ చేసినట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ బృందం విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న "ఓజి" అనే మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: