బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజాగా టైగర్ 3 అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కత్రినా కైఫ్ ... సల్మాన్ కి జోడిగా నటించగా ... మనిష్ శర్మ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న నిర్మాణ సంస్థలలో ఒకటి అయినటువంటి యాష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ వారు ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇకపోతే ఈ మూవీ తాజాగా దీపావళి సందర్భంగా నవంబర్ 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయింది. ఈ మూవీ విడుదలకు ముందు నుండే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నందున ఈ మూవీ కి సంబంధించిన టికెట్ లు ముందుగానే భారీ ఎత్తుగా అమ్ముడు పోయాయి. అందులో భాగంగా బుక్ మై షో యాప్ లో ఈ మూవీ కి నవంబర్ 4 వ తేదీ నుండి 10 వ తేదీ వరకు ఏ రోజున ఎన్ని టికెట్ లు అమ్ముడుపోయాయి అనే విషయాలను తెలుసుకుందాం.
ఈ మూవీ కి సంబంధించిన టికెట్ లు బుక్ మై షో లో నవంబర్ 4 వ తేదీన 36.84 కే టికెట్ లు అమ్ముడుపోగా... నవంబర్ 5 వ తేదీన 83.92 కే ... నవంబర్ 6 వ తేదీన 53.35 కే ... నవంబర్ 7 వ తేదీన 51.51 కే ... నవంబర్ 8 వ తేదీన 53.08 కే ... నవంబర్ 9 వ తేదీన 79.3 కే ... నవంబర్ 10 వ తేదీన 115.4 కే టికెట్ లు అమ్ముడు పోయాయి.
ఇక మొత్తంగా నవంబర్ 4 వ తేదీ నుండి 10 వ తేదీ వరకు బుక్ మై షో యాప్ లో టైగర్ 3 మూవీ కి సంబంధించి 473.4 కే టికెట్ లు అమ్ముడు పోయాయి. ఒక విధంగా చూసుకుంటే ఈ మూవీ టికెట్ లకి బుక్ మై షో యాప్ లో అదిరిపోయే రేంజ్ సూపర్ సాలిడ్ రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించింది అని చెప్పవచ్చు.