కుర్ర హీరోతో సమంత రొమాన్స్.. జోడి కుదిరేనా..?

Divya
హీరోయిన్ సమంత విడాకులు తీసుకున్న తర్వాత అనారోగ్య బారిన పడడంతో గత కొద్దిరోజులుగా వార్తలలో నిలుస్తూనే ఉంది. ఇటీవలే కాస్త సినిమాలకు బ్రేకులు ఇచ్చి.. మరి మయూసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటోంది .అంతేకాకుండా మధ్య మధ్యలో కొన్ని సినిమాలలో నటిస్తూ ఉంటుంది. సమంత అమెరికాకు వెళ్లి చికిత్స తీసుకుంటోందని ప్రచారం కూడా జరుగుతోంది. సుమారుగా ఒక నెల రోజులపాటు అక్కడే ఉండి ఇండియాకు తిరిగి వచ్చిక సమంత పలు ప్రాజెక్టులతో విషయంలో చాలా కేర్ ఫుల్ గా ముందుకు వెళ్ళబోతున్నట్లు సమాచారం.



సమంత కథల కోసం పాన్ ఇండియా చిత్రాలు సైతం వస్తున్నప్పటికీ.. ఆచితూచి అడుగులు వేస్తోంది.ఇదే సమయంలో ఈమెకు డిజె టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డతో కలిసి ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సమంత, నందిని రెడ్డి గతంలో కూడా జబర్దస్త్, ఓ బేబీ వంటి సినిమాలకు కలిసి పనిచేయడం జరిగింది. వ్యక్తిగతంగా కూడా వీరిద్దరూ మంచి స్నేహితులు కావడంతో వీరిద్దరి కాంబినేషన్లో మరో ప్రాజెక్ట్ చేసే పనిలో పడినట్లుగా తెలుస్తోంది. ముందు ఈ ప్రాజెక్టుకు నాగచైతన్యా ని హీరోగా తీసుకోబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది.


కానీ ఇప్పుడు ఆ ప్లేస్ లో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ వచ్చి అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అన్ని సవ్యంగా జరిగితే త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలుపడే అవకాశం ఉన్నది మరి అలాంటి హీరోతో సమంత సినిమా చేయడానికి ముందుకు వస్తుందా రాదా అనే విషయం ఇంకా అభిమానుల చర్చనీయాంశంగానే మారింది.. తన స్నేహితురాలు నందిని రెడ్డి కోసం అయినా సమంత ఇలాంటి రిస్క్ చేస్తుందని అభిప్రాయం అందరిలో వినిపిస్తోంది. రెమ్యూనరేషన్ విషయంలో కూడా కాస్త తగ్గి మరి స్నేహితురాలు కోసం సమంత ఇలాంటి సినిమాలలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి .మరి ఈ విషయంలో చిత్ర బృందం అధికారికంగా క్లారిటీ ఇస్తే తప్ప నటిస్తారా లేదా అనే విషయం తెలియడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: