సూపర్ స్టార్ విగ్రహ ఆవిష్కరణకు మహేష్ రాకపోవడానికి కారణం....!!!

murali krishna
బుర్రిపాలెం బుల్లోడు సూపర్ స్టార్ కృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటన.. ఆయన వ్యక్తిత్వం ప్రతి ఒక్కరికి తెలుసు.ఇక సూపర్ స్టార్ కృష్ణ గతేడాది నవంబర్ 15 న మృతి చెందారు. వయో వృద్దాప్య సమస్యలతో పోరాడుతూ ఆయన కన్నుమూశారు. ఇక ఆయన మృతి.. మహేష్ బాబు ను ఎంతో కృంగదీసింది. తాజాగా కృష్ణ విగ్రహాన్ని విజయవాడలో ప్రతిష్టించారు. విజయవాడలోని గురునానక్ కాలనీ కేడీజీవో పార్కులో ఏర్పాటుచేసిన నటశేఖరుడి విగ్రహాన్ని లోక నాయకుడు కమల్ హాసన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి దేవినేని అవినాష్,విజయవాడ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ పాల్గొన్నారు. ఇక కృష్ణ విగ్రహావిష్కరణ జరుగుతుండగా.. అక్కడ మహేష్ బాబు కానీ, ఘట్టమనేని కుటంబ సభ్యులు ఎవరు లేకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తండ్రి విహగ్రహావిష్కరణకు కనీసం మహేష్ బాబు అయినా ఉంటే బావుండేది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

ఇంకొంతమంది అస్సలు మహేష్ బాబు ఎందుకు రాలేదు.. ? అని ఆరాలు తీస్తున్నారు ఈ విగ్రహావిష్కరణకు మహేష్ బాబుకు, ఘట్టమనేని కుటుంబానికి ఆహ్వానం అందలేదా.. ? లేక అందినా వారు రాలేకపోయారా.. ? అనే విషయం తెలియాల్సి ఉంది. మహేష్.. తాను విగ్రహావిష్కరణకు రాలేకపోయినా సోషల్ మీడియా ద్వారా అందరికి థాంక్స్ చెప్పాడు. ' విజయవాడలో కృష్ణగారి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరైనందుకు కమల్ హాసన్ గారికి, దేవినేని అవినాష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాన్నగారి విగ్రహాన్ని ఆవిష్కరించడం నిజంగా గర్వకారణం, ఆయన వదిలి వెళ్లిన వారసత్వానికి నివాళులు. అలాగే, ఈ ఈవెంట్‌ను సాధ్యం చేసిన అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు' అంటూ చెప్పుకొచ్చాడు. నవంబర్ 15 అంటే.. కృష్ణ వర్థంతి రోజున ఘట్టమనేని కుటుంబం ఈ విగ్రహం వద్దకు వెళ్లి నివాళులు అర్పిస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: