శృతిహాసన్ పై మండిపడుతున్న ఫ్యాన్స్.. కారణం..?
ఇక ఆ తర్వాత స్టార్ హీరోలు అందరి సరసన నటించి భారీ పేరు దక్కించుకున్న శృతిహాసన్.. ఇప్పుడు ప్రభాస్ సరసన సలార్ సినిమాలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో భాగమైంది. త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధం కానుంది. ఈ నేపథ్యంలోనే శృతిహాసన్ కి సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. అసలు విషయంలోకెళితే వరుస సినిమాలు చేస్తూ, బిజినెస్ లు చేస్తూ శృతిహాసన్ కోట్లు సంపాదిస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలోనే ఆమెపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసలేమైంది అంటే శృతిహాసన్ తండ్రి కమలహాసన్ ఆమె తల్లి సారిక ఇద్దరు గత కొన్ని సంవత్సరాలు క్రితం విడిపోయిన విషయం తెలిసిందే. అయితే కరోనా సమయంలో సారిక తినడానికి తిండి లేదని, థియేటర్ ఆర్టిస్ట్ గా పని చేస్తున్నాను అని తన బాధలను చెప్పుకొచ్చింది. అంతేకాదు కమలహాసన్, శృతిహాసన్ ఇద్దరు కూడా తనకు ఏమాత్రం సహాయం చేయలేదని కూడా ఆమె ఆరోపించింది. అయితే ఇప్పుడు కూడా కోట్లు సంపాదిస్తున్న శృతిహాసన్ తన తల్లి రూమ్ రెంట్ కూడా కట్టలేని పరిస్థితిలో ఇబ్బంది పడుతూ ఉంటే.. ఆమె చలించకపోవడం అందరిని మరింత అగ్రహానికి గురి చేస్తుంది. ఏది ఏమైనా పిల్లలు తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి కానీ ఒక స్టార్ సెలబ్రేట్ అయిండి ఇలా కన్నతల్లిని ఇబ్బందులకు గురి చేస్తున్న శృతిహాసన్ క్యారెక్టర్ ని చూసి ప్రతి ఒక్కరు విరుచుకుపడుతున్నారు .