ఏంటీ.. హీరో రవితేజని చంపాలని చూసారా?

praveen
ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఏదో సాధించాలని కసితో వచ్చిన వాళ్ళలో స్టార్ హీరోగా కొనసాగుతున్న రవితేజ కూడా ఒకరు.  ఏకంగా అవకాశాలు లేకపోవడంతో అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రస్తానాన్ని మొదలుపెట్టాడు రవితేజ. ఎంతో మంది స్టార్ డైరెక్టర్ల దగ్గర పని చేశాడు. ఇక ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ని ప్రారంభించాడు. హీరోలకు తమ్ముడి క్యారెక్టర్ లలో నటించేవాడు.


 అయితే తర్వాత రవితేజ హీరోగా అవతారమైత్తి నీకోసం అనే సినిమాలో నటించాడు. అయితే మొదటి సినిమానే మంచి విజయం సాధించింది. దీంతో రవితేజకు కూడా గుర్తింపు వచ్చింది అని చెప్పాలి. ఇక ఆ తర్వాత ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు అనే సినిమాలు కూడా మంచి విజయాలు సాధించాయ్. ఆ తర్వాత పూరి జగన్నాద్ దర్శకత్వంలో వచ్చిన ఇడియట్ సినిమా రవితేజ కెరియర్ను మలుపు తిప్పింది. ఒక్కసారిగా స్టార్ హీరోని చేసింది. ఇక ఎప్పుడూ రవితేజ ఏకంగా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా మాస్ మహారాజుగా కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి.


 ఇడియట్ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఎదుగుతున్న సమయంలో అతని ఎదుగుదల చూసి మరో హీరోకి అసూయ పుట్టిందట. దీంతో ఎన్నోసార్లు రవితేజతో ఆ హీరో మాటలు యుద్ధానికి దిగాడట. అయితే ఒకసారి రవితేజ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నన్ను తొక్కేయాలని కొంతమంది ఎంతగానో ఎదురు చూసారు. కానీ తొక్కేయడం ఎవరి తరం కాలేదు. నాకు కోపం తెప్పించేందుకు ఎన్నో మాటలు అన్నారు అతని పలుకుబడి ఉపయోగించుకొని మూవీ చాన్సులు రాకుండా కొన్నాళ్లపాటు ఇబ్బంది పెట్టాడు. కానీ తర్వాత డైరెక్టర్లే ఇంటికి వచ్చి మరి అవకాశాలు ఇచ్చారుఅంటూ చెప్పుకొచ్చాడు. అయితే రవితేజను చంపడానికి ఆ హీరో ఏకంగా జేబులో గన్ పెట్టుకొని కూడా తిరిగారట. ఎంతోమందికి సుపారీలు కూడా ఇచ్చాడట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: