"కీడా కోలా" 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!
ఈ మూవీ కి 5 రోజుల్లో నైజాం ఏరియాలో 2.30 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1.29 కలెక్షన్ లు దక్కాయి. ఇక మొత్తంగా ఈ మూవీ కి 5 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని 3.59 కోట్ల షేర్ ... 6.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఇక ఈ మూవీ కి 5 రోజుల్లో కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లో కలుపుకొని 2.90 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. ఇక మొత్తంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 5 రోజుల్లో 6.49 కోట్ల షేర్ ... 12.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 8.5 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 9 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇకపోతే ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా క్లీన్ హీట్ గా నిలవాలి అంటే మరో 2.51 కోట్ల షేర్ కలెక్షన్ లను రాబట్టవలసి ఉంది.