5 రోజుల్లో "పొలిమేర 2" సినిమాకు వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
కొంతకాలం క్రితం పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయిన మా ఊరి పొలిమేర సినిమా ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి ఏ స్థాయిలో ప్రశంసలను అందుకుందో మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ మొదటి భాగం మంచి విజయం సాధించడంతో తాజాగా ఈ సినిమా యొక్క రెండవ భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ మూవీ రెండవ భాగాన్ని తాజాగా నవంబర్ 3 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేశారు. ఇకపోతే ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ ఐదు రోజుల్లో ఈ సినిమాకి వారిగా ప్రపంచవ్యాప్తంగా దక్కిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

ఈ మూవీ కి 5 రోజుల్లో నైజాం ఏరియాలో 3.26 కోట్లు , సీడెడ్ ఏరియాలో 62 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 2.21 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు 5 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 6.10 కోట్ల షేర్ ... 11.32  కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లో కలుపుకొని 5 రోజుల్లో 86 లక్షల కలెక్షన్ లు దక్కాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 6.96 కోట్ల షేర్ ..  13.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఇకపోతే ఈ మూవీ కి వరల్డ్ వైడ్ గా 3.5 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగింది. ఇకపోతే ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే జరుపుకున్న ప్రి రిలీజ్ బిజినెస్ కంటే 2.96 కోట్ల షేర్ కలక్షన్ లను ఎక్కువగా రాబట్టి బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: