సలార్ సినిమాపై హైప్ పెంచేస్తున్న హన్సిక..!!
సలార్ సినిమాలో నటించిన శ్రియ రెడ్డి తనకు మంచి స్నేహితురాలు అని ఆమె చాలా విషయాలను రివిల్ చేసిందని తెలిపింది. ఈ విషయాలను రివిల్ చేయలేను కానీ సలార్ మొదటి భాగం మాత్రం సూపర్ గా ఉంటుందని తెలిపింది. ఈ చిత్రం ఎక్స్ట్రాడినరీగా ఉండబోతోందని హన్సిక అభిప్రాయంగా తెలిపింది.. పాన్ ఇండియా మూవీగా థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమా అంచనాలకు మించి విజయం అందుకుంటుంది అంటూ ప్రభాస్ కెరియర్ లోని ఒక ఫీల్ గుడ్ మూవీ అవుతుందని తెలిపింది హన్సిక.
అభిమానుల అంచనాలను ఏమాత్రం నిరాశపరిచేలా ఉండదని తెలిపింది. ట్రైలర్ రిలీజ్ అయితే మాత్రం మామూలుగా ఉండదని తెలియజేసింది హన్సిక.సలార్ చిత్రంలో నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తూ ఉన్నారు. అలాగే జగపతిబాబు నెగిటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నారు. అతి త్వరలోనే సలార్ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అంతకంటే ముందు సలార్ సినిమా ట్రైలర్ విడుదలైన తరువాత ఈ సినిమా బిజినెస్ పరంగా భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇందులో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది గతంలో కూడా శృతిహాసన్ ఈ సినిమా పైన పలు విషయాలను తెలియజేయడం జరిగింది. మరి ఏ మేరకు ఈ సినిమా ఆకట్టుకుంటుందో చూడాలి.