సలార్ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆరాటం గురించి మాటల్లో చెప్పలేం. ఈ సినిమా విడుదల కోసం దాదాపు రెండేళ్ల నుంచి ఎంతగానో ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. బాహుబలి సినిమా తర్వాత డార్లింగ్ కు సరైన బాక్స్ ఆఫీస్ సక్సెస్ లేకపోయినప్పటికీ ఈ సినిమాపై మాత్రం అంచనాలు అయితే ఏమాత్రం తగ్గలేదు.అందుకే ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫాన్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ లో రావలసిన సినిమాను ఒకేసారి డిసెంబర్ కు షిఫ్ట్ అయినా ఫ్యాన్స్ తట్టుకున్నారు. ఇక ఈ డిసెంబర్ కు అయినా సినిమాను తప్పకుండా విడుదల చేస్తారు అని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ సినిమాని డిసెంబర్ 22 వ తేదీన చాలా భారీగా విడుదల చేస్తున్నారు. కేరళలో ఈ సినిమా విలన్ ప్రముఖ స్టార్ హీరో పృథ్వీ రాజ్ విడుదల చేస్తున్నారు.ఇప్పటివరకు సలార్ మూవీ టీం కేవలం పోస్టర్స్ లో తప్ప ప్రభాస్ ఫేస్ ని టీజర్ లో ఫర్ఫెక్ట్ గా హైలెట్ చేయలేకపోయారు. విడుదల చేసిన టీజర్ లో ప్రభాస్ బాడీ తోనే బిల్డప్ ఇచ్చేసి మొహాన్ని కనిపించకుండా మ్యానేజ్ చేశారు.
అయితే ట్రైలర్ లో మాత్రం ప్రభాస్ ఒక రేంజ్ లో ఉంటాడట. ట్రైలర్ ని ఈ నెలాఖరున రిలీజ్ చేస్తారట. ప్రభాస్ ఫ్యాన్స్ ని నిరుత్సాహ పరచకుండా ప్రశాంత్ నీల్ ట్రైలర్ ని డిజైన్ చేస్తున్నాడట. అలాగే సినిమా విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దాదాపు అన్ని రాష్ట్రాలలో కూడా భారీ స్థాయిలో కటౌట్లు సిద్ధం చేసి సినిమాకు హైప్ ఎక్కించాలి అని మేకర్స్ చూస్తున్నారు. ముఖ్యంగా నార్త్ లో ముంబై ఢిల్లీ వంటి నగరాల్లో ఎక్కువ స్థాయిలో ప్రభాస్ కటౌట్స్ కనిపించే అవకాశం ఉంది. సౌత్ లో ఎలాగో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది కాబట్టి నార్త్ లో చాలా గట్టిగా ప్రచారం చెయ్యాలని ఫిక్స్ అయ్యారట. ఈ సినిమా కేవలం హిట్ అయితే సరిపోదు. పాత రికార్డులని బద్దలు కొట్టి కొత్త రికార్డులు క్రియేట్ చెయ్యాలని మూవీ టీం సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుందట.మరి చూడాలి సినిమా ఎంత పెద్ద హిట్ ని నమోదు చేస్తుందో..