2 రోజుల్లో "కీడా కోలా" మూవీకి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
పెళ్లి చూపులు ... ఈ నగరానికి ఏమైంది మూవీ లకి దర్శకత్వం వహించి ఈ రెండు మూవీ లతో కూడా మంచి విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న తరుణ్ భాస్కర్ తాజాగా కీడా కోలా అనే క్రైమ్ కామెడీ జోనర్ కు సంబంధించిన సినిమాకు దర్శకత్వం వహించిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ మంచి అంచనాల నడుమ నవంబర్ 3 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ మూవీ ఇప్పటి వరకు 2 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ రెండు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా దక్కిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి 2 రోజుల్లో నైజాం ఏరియాలో 1.55 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 90 లక్షల కలెక్షన్ లు దక్కాయి. ఇక మొత్తంగా ఈ మూవీ కి 2 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని 2.45 కోట్ల షేర్ ... 4.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఇక ఈ మూవీ కి 2 రోజుల్లో కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లో కలుపుకొని 2.10 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. ఇక మొత్తంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 2 రోజుల్లో 4.55 కోట్ల షేర్ ... 8.89 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 8.5 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 9 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇకపోతే ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా క్లీన్ హీట్ గా నిలవాలి అంటే మరో 4.45 కోట్ల షేర్ కలెక్షన్ లను రాబట్టవలసి ఉంది. ఇకపోతే ఈ మూవీ కి తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించడం మాత్రమే కాకుండా ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: