జపాన్ వర్సెస్ జిగర్ తండా 2.. గెలుపెవరిది..?

shami
ఈ శుక్రవార తెలుగు బాక్సాఫీస్ దగ్గర రెండు తమిళ సినిమాల మధ్య ఫైట్ జరుగుతుంది. అందులో ఒకటి కార్తీ నటించిన జపా సినిమా కాగా మరొకటి లారెన్స్ నటించిన జిగర్ తండా డబుల్ ఎక్స్. జపాన్ సినిమాను రాజ్ మురుగన్ డైరెక్ట్ చేశారు. కార్తీ వెరైటీ పాత్రలో వెరైటీ డైలాగ్ డిక్షన్ తో ఈ సినిమాలో కనిపిస్తున్నారు. సూర్య తర్వా కార్తీకి కూడా తెలుగులో సూపర్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే అతని ప్రతి సినిమా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఎస్.ఆర్ ప్రభు నిర్మించిన జపాన్ సినిమాను తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ రిలీజ్ చేస్తున్నారు.

ఇక మరోపక్క కార్తీక్ సుబ్బరాజు డైరెషన్ లో తెరకెక్కిన జిగర్ తండా 2 కూడా మంచి బజ్ తో వస్తుంది. ఆల్రెడీ జిగర్ తండ సినిమా తెలుగులో గద్దలకొండ గనేష్ గా రీమేక్ అయ్యింది. అయితే ఆ టైం లో జిగర్ తండా ని తెలుగులో రిలీజ్ చేయలేదు. ఇక ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ టైటిల్ తో వస్తున్న జిగర్ తండ 2 సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజు టేకింగ్ కి తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు.

లారెన్స్, ఎస్.జె సూర్య ప్రధాన పాత్రలుగా వస్తున్న జిగర్ తండా 2 కూడా క్రేజీగా మూవీగా వస్తుంది. అయితే జపాన్ వర్సెస్ జిగర్ తండా 2 తెలుగులో కూడా ఈ సినిమాల మధ్య గట్టి ఫైట్ జరుగుతుంది. ఈ వీకెండ్ తెలుగు సినిమాలేవి లేకపోవడం వల్ల డబ్బింగ్ సినిమాలకే వదిలేసినట్టు అయ్యింది. మరి ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఎలా ఉంటుంది. ఏ సినిమా విజయ పతాకం ఎగరవేస్తుంది అన్నది చూడాలి. రెండు సినిమాల మీద మేకర్స్ చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నారు. తెలుగులోనే కాదు తమిళంలో కూడా ఈ సినిమాల మధ్య ఊహించని విధంగా ఫైట్ జరుగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: