సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే
మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ లో మీనాక్షి
చౌదరి ...
శ్రీ లీలా హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా
తమన్ ఈ
మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీలో
రమ్యకృష్ణ ... జయరామ్ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఇకపోతే ఈ
మూవీ ని వచ్చే సంవత్సరం
సంక్రాంతి కానుకగా
జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ బృందం ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే.
ఈ
సినిమా విడుదల తేదీ ఇప్పటికే దగ్గర పడింది అయినప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ చాలా భాగం పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ
మూవీ ని కచ్చితంగా
సంక్రాంతి కి విడుదల చేయాలి అని ఈ చిత్ర బృందం డిసైడ్ అవడంతో ఈ
మూవీ కి సంబంధించిన షూటింగ్ ను చాలా స్పీడ్ గా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ
మూవీ షూటింగ్ ను చాలా స్పీడ్ గా పూర్తి చేయాలి అనే ఉద్దేశంతో ఈ
మూవీ బృందం
రమ్యకృష్ణ పై ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలను రూపొందిస్తున్న సమయం లోనే వేరే చోట జయరామ్ పై కూడా కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఇలా మహేష్ బాబు లేని సన్నివేశాలను ఒకే సారి వేరు వేరు చోట్ల ఈ చిత్ర బృందం చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇలా ఈ
మూవీ షూటింగ్ ను చాలా స్పీడ్ గా రూపొందించి ఈ
మూవీ ని వచ్చే సంవత్సరం
సంక్రాంతి కి విడుదల చేయాలి అని ఈ చిత్ర బృందం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. వరుస విజయాలతో ఫుల్
జోష్ లో ఉన్న మహేష్ నటిస్తున్న
మూవీ కావడం ... అలా వైకుంఠపురంలో
సినిమా తర్వాత
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన
మూవీ కావడంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నిలకొని ఉన్నాయి.