సలార్ సినిమాపై శృతిహాసన్ షాకింగ్ కామెంట్స్..!!
శృతిహాసన్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో శృతిహాసన్ ఉంది కదా అని అందరూ అనుకోవచ్చు.. ప్రభాస్ సలార్ సినిమాలో తాను నటిస్తున్నాను కానీ అది పూర్తిగా ప్రభాస్ సినిమా అని తెలియజేసింది. ప్రభాస్ చాలా కష్టపడి తన కెరీర్ ని ఒక బిల్డ్ చేసుకుంటూ వస్తున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా తన పందలో తను ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ ఇద్దరు కలిసి చేస్తున్న చిత్రమే సలార్ అంటూ తాను నటించాను అంతే అని తెలిపింది శృతిహాసన్. ఎందుకంటే ఈ సినిమాలో హీరోయిన్ ఎంత ఇంపార్టెంట్ అయిన బొమ్మ బ్లాక్ బస్టర్ కావాలి అంటే అది హీరోల వల్లే అవుతుంది.
హీరోల ఇమేజ్ కు అందుకు తగ్గట్టుగానే బజ్ ఏర్పడుతుందని..బిజినెస్ కు కూడా కారణం అవుతుందని స్టార్ హీరోల చిత్రాలలో హీరోయిన్స్ కొన్నిసార్లు కేవలం ప్రాధాన్యత ఉండే పాత్రలోనే కనిపిస్తారు.. మరి కొన్నిసార్లు పాటలు గ్లామర్ కోసమే అన్నట్టుగా ఉంటారని తెలిపింది శృతిహాసన్. అయితే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గతంలో కూడా శ్రీనిధి శెట్టి లైఫ్ ఇచ్చినప్పుడు శృతిహాసన్ కి కూడా సలార్ సినిమాతో కచ్చితంగా క్రేజ్ వస్తుందని అభిమానులు నమ్ముతున్నారు. ఏడాది శృతిహాసన్ వరుస సినిమాలతో మంచి విజయాలను అందుకుంది మరి సలార్ సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.